NTV Telugu Site icon

Donald Trump: రష్యా అధ్యక్షుడిపై ట్రంప్ ఆగ్రహం.. దేశాన్ని నాశనం చేస్తున్నాడని విమర్శలు!

Puthin

Puthin

Donald Trump: రష్యా అధినేత పుతిన్ పై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. సోమవారం నాడు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రష్యా పెద్ద చిక్కుల్లో పడబోతుందని చెప్పుకొచ్చాడు. అందు కోసమే.. నేను పుతిన్‌ను కలవడానికి సిద్ధంగా ఉన్నా.. దానికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయని అతడు అన్నారు. ఇక, ఉక్రెయిన్‌తో సంధిని పుతిన్ కోరుకుంటున్నారని ఆశిస్తున్నా.. కాకపోతే ఆయన సరిగ్గా స్పందించడంలేదు.. అక్కడ సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగుతునే ఉందని వెల్లడించారు. ఈ యుద్ధం ప్రారంభమై ఇప్పటికి మూడేళ్లైంది.. ద్రవ్యోల్బణం, ఇతర అంశాలతో రష్యా ఆర్థిక వ్యవస్థ బాగా క్షిణించిందని తెలిపాడు. మరోవైపు జెలెన్‌స్కీ కూడా శాంతిని కోరుకుంటున్నారని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

Read Also: Varun Tej: వరుణ్ తేజ్ ‘VT 15’ ప్రాజెక్ట్‌కి క్రెజీ టైటిల్ ఫిక్స్..

అయితే, డొనాల్డ్‌ ట్రంప్‌తో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అవనున్నారని వస్తున్న వార్తలపై కొన్నాళ్ల క్రితం మాస్కో అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ క్లారిటీ ఇచ్చారు. ట్రంప్‌ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత అతడితో చర్చలు కొనసాగిస్తామన్నారు. కానీ, పుతిన్‌తో చర్చల కోసం అమెరికా ఇప్పటి వరకు తమతో ఎలాంటి సంప్రదింపులు చేయలేదని వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంపై ఇప్పటికే ట్రంప్‌ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. యుద్ధాన్ని పొడిగించొద్దని పుతిన్‌కు ట్రంప్‌ సూచించినట్లు అమెరికా అధికార వర్గాలు తెలిపాయి.