Russia-Ukraine War: అదే జరిగితే అణుయుద్ధం తప్పుదు.. రష్యా మాజీ అధ్యక్షుడి హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్దం ప్రారంభం అయి 11 నెలలు గడుస్తోంది. వచ్చే నెలతో ఏడాది పూర్తవుతుంది. అయినా కూడా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. తప్పితే తగ్గడం లేదు. గతేడాది ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్ పై సైనిక చర్యను ప్రారంభించింది. అయితే సైనికపరంగా శక్తివంతమైన రష్యా ముందు ఉక్రెయిన్ వారం రోజుల్లో లొంగిపోతుందని అంతా అనుకున్నప్పటికీ.. పాశ్చాత్య దేశాలు, అమెరికా, నాటో కూటమి ఇచ్చే ఆర్థిక, సైనిక సహకారంతో ఉక్రెయిన్, రష్యాను ఎదురించి పోరాడుతోంది.
Read Also: Uorfi Javed: నిజాన్ని ఒప్పుకున్న ఉర్ఫీ జావేద్.. పాపులారిటీ కోసమే ఇదంతా
Also Read
- US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
- Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
- AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
- US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
ఇదిలా ఉంటే ఈ యుద్ధం అణు యుద్ధంగా మారతుందని ప్రపంచం మొత్తం ఆందోళనలు నెలకొన్నాయి. పలు సందర్భాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణు హెచ్చరికలు చేశారు. ఇదిలా ఉంటే రష్యా మాజీ అధ్యక్షుడు, పుతిన్ కు అత్యంత సన్నిహితుడు డెమిత్రి మెద్వదేవ్ మరోసారి అణుహెచ్చరికలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఓడిపోతే అణుయుద్ధం తప్పదని అన్నారు. సాంప్రాదాయ యుద్దంలో అణుశక్తిని ఓడిస్తే అణుయుద్ధానికి దారి తీయవచ్చని పేర్కొన్నారు. దీనిపై ఆయన టెలిగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు.
ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో రష్యా, ఉక్రెయిన్ పై దాడిని తీవ్రతరం చేసింది. క్షిపణులతో విరుచుకుపడుతోంది. గత వారం క్షిపణి దాడిలో ఏకంగా 40 మంది మరణించారు. విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ అమెరికాలో పర్యటించాడు. అమెరికా నుంచి సైనిక, ఆర్థిక సాయాలను కోరాడు. దీంతో అమెరికా తన పెట్రియాడ్ క్షిపణి వ్యవస్థను ఉక్రెయిన్ కు ఇస్తోంది. ఇదిలా ఉంటే బ్రిటన్ ఛాలెంజర్ యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్ కు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ రెండు ప్రకటనల తర్వాత రష్యా, ఉక్రెయిన్ పై దాడులు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని జపొరొజ్జియా, ఖేర్సన్, లూహాన్స్క్, డొనెట్స్క్ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది.
తాజావార్తలు
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!