Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Putin Abbas Araghchi Meeting Russia Iran Strategic Support Usa Tensions

Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్‌కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!

Published Date :April 27, 2026 , 7:44 pm
By Shiva Ganesh
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్‌కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Putin – Abbas Araghchi Meeting: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ – ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మధ్య జరిగిన భేటీ అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సోమవారం రష్యా చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో పుతిన్ నేరుగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరాన్‌కు రష్యా తన పూర్తి మద్దతును ప్రకటించడం ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది.

ప్రోటోకాల్‌ను కాదని పుతిన్ భేటీ..
సాధారణంగా ఏ దేశ విదేశాంగ మంత్రి అయినా మరో దేశానికి వెళ్లినప్పుడు అక్కడి విదేశాంగ మంత్రిని మాత్రమే కలుస్తారు. కానీ ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పుతిన్ స్వయంగా అరాఘ్చీని ఆహ్వానించి చర్చలు జరపడం ఈ భేటీ ప్రాధాన్యతను చాటిచెబుతోంది. ఇస్లామాబాద్‌ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలమైన తరుణంలో ఈ సమావేశం జరగడం గమనార్హం. ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ నుంచి తనకు ఒక ప్రత్యేక సందేశం అందిందని పుతిన్ ఈ సందర్భంగా వెల్లడించారు. పుతిన్ మాట్లాడుతూ.. ఖమేనీ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. రెండు దేశాల అగ్ర నాయకత్వాల మధ్య దౌత్య సంబంధాలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయని స్పష్టం చేశారు.

Also Read

  • Iranian Attack Indian Crew: ఒమన్‌ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడులు!
  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
  • Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్‌పై ట్రంప్ ఆగ్రహం
  • Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం

ఇరాన్‌కు పుతిన్ ఇచ్చిన హామీలు ఇవే..
ఇరాన్ ప్రయోజనాల కోసం, ఆ ప్రాంతంలోని ఇతర దేశాల శ్రేయస్సు కోసం రష్యా శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని పుతిన్ హామీ ఇచ్చారు. టెహ్రాన్‌తో మాస్కో తన వ్యూహాత్మక సంబంధాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. దీని అర్థం.. కేవలం వాణిజ్యమే కాకుండా సైనిక, రాజకీయ అంశాల్లోనూ రెండు దేశాలు ఒకదానికొకటి వెన్నుదన్నుగా నిలవనున్నాయి. ఈ క్లిష్ట కాలాన్ని అధిగమించి త్వరలోనే ఇరాన్‌లో శాంతి నెలకొంటుందని రష్యా ఆశిస్తోందని పుతిన్ పేర్కొన్నారు. ఈ భేటీతో ఇరాన్ ఒంటరి కాదని, రష్యా వంటి అగ్రరాజ్యం దాని వెనుక ఉందని ప్రపంచానికి స్పష్టమైన సంకేతం వెళ్లింది. ఇది ఒక రకంగా ప్రపంచం రెండు వర్గాలుగా విడిపోయిందని సూచిస్తోందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఒకవైపు అమెరికా, యూరప్, దాని మధ్యప్రాచ్య మిత్రదేశాలు ఉండగా.. మరోవైపు అమెరికా పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్న రష్యా – ఇరాన్ మొదలైన దేశాలు ఉన్నాయి. రష్యా అండతో ఇరాన్ ఇకపై అంతర్జాతీయ వేదికలపై, చర్చల్లో మరింత వ్యూహాత్మకంగా, బలంగా తన గళాన్ని వినిపించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Iran diplomatic victory.
  • Iran-Russia strategic relations
  • Middle East war updates 2026
  • Putin Abbas Araghchi Meeting
  • Putin Masterstroke against USA

తాజావార్తలు

  • Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్‌కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!

  • AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!

  • CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!

  • RCB Vs DC: విరాట్‌ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే.. 

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions