Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
- ప్రిన్సెస్ ఇసబెల్లా సైనిక సేవలో చేరి చరిత్ర సృష్టించారు
- సాధారణ యువతిలా బ్యారక్స్‌కు రాక
- జీతం తీసుకోనని నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Princess Isabella military service:డెన్మార్క్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్సెస్ ఇసబెల్లా సైనిక సేవలో చేరి చరిత్ర సృష్టించారు. డెన్మార్క్ రాజకుటుంబం నుంచి పూర్తి స్థాయి తప్పనిసరి సైనిక శిక్షణలో చేరిన తొలి మహిళగా 19 ఏళ్ల ఇసబెల్లా గుర్తింపు పొందారు. కింగ్ ఫ్రెడరిక్ X, క్వీన్ మేరీ దంపతుల పెద్ద కుమార్తె అయిన ఇసబెల్లా.. ఆగస్టు 3న స్లాగెల్సేలోని ఆంట్వోర్స్కోవ్ బ్యారక్స్‌లో 11 నెలల మిలటరీ సర్వీస్ ను ప్రారంభించారు.
సాధారణ యువతిలా బ్యారక్స్‌కు రాక
హైస్కూల్ చదువు పూర్తి చేసిన కొన్ని వారాలకే ఇసబెల్లా సైనిక సేవలో చేరారు. వేసవి సెలవుల అనంతరం ఆమె ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా బ్యారక్స్‌కు చేరుకోవడం విశేషంగా మారింది. ఇసబెల్లా స్వయంగా నల్లటి SUV కారును నడుపుకుంటూ బ్యారక్స్‌కు వచ్చారు. బ్యాగీ జీన్స్, స్వెడ్ జాకెట్ ధరించి, పెద్ద బ్యాక్‌ప్యాక్‌తో పాటు చిన్న హ్యాండ్‌బ్యాగ్‌ను తీసుకుని కనిపించారు. బ్యారక్స్ ప్రవేశద్వారం వద్ద విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డుకు తన గుర్తింపు కార్డును చూపించారు. అక్కడ కొంతమంది స్థానిక జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు ఉన్నప్పటికీ.. ఇసబెల్లా కొద్దిసేపు వారికి అభివాదం చేసి నేరుగా లోపలికి వెళ్లిపోయారు.
Also Read
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
అన్న బాటలోనే యువరాణి
ఇసబెల్లా తన అన్న క్రౌన్ ప్రిన్స్ క్రిస్టియన్ బాటలోనే సైనిక సేవలో చేరారు. క్రిస్టియన్ కూడా ఇదే బ్యారక్స్‌లో సైనిక శిక్షణ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన సెకండ్ లెఫ్టినెంట్‌గా శిక్షణ పొందుతున్నారు. డెన్మార్క్ రాజకుటుంబ సభ్యులు సైన్యంలో సేవ చేయడం కొత్త విషయం కాదు. అయితే, రాజకుటుంబానికి చెందిన మహిళ పూర్తి స్థాయి సైనిక నియామక కార్యక్రమంలో భాగం కావడం ఇదే తొలిసారి.
జీతం తీసుకోనని నిర్ణయం
ప్రిన్సెస్ ఇసబెల్లా తీసుకున్న మరో నిర్ణయం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా డెన్మార్క్‌లో సైనిక సేవ చేసే వారికి నెలవారీ జీతంతో పాటు పన్ను రహిత రోజువారీ అలవెన్స్ కూడా అందుతుంది. అయితే ఇసబెల్లా మాత్రం తన సైనిక సేవకు జీతం, రోజువారీ అలవెన్స్ తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. డెన్మార్క్ రాజకుటుంబం ఈ విషయాన్ని ధృవీకరించింది. సైనిక సేవ సమయంలో ఆమెకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని తల్లిదండ్రులైన కింగ్ ఫ్రెడరిక్ X, క్వీన్ మేరీ అందించనున్నారు.
మహిళలకు తప్పనిసరి సైనిక సేవ
యూరప్‌లో భద్రతా పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో డెన్మార్క్ తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం, ఆర్కిటిక్ ప్రాంతంలో పెరుగుతున్న భద్రతా ఉద్రిక్తతలు డెన్మార్క్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో డెన్మార్క్ 2024లో మహిళలకు కూడా తప్పనిసరి సైనిక సేవను ప్రవేశపెట్టింది. అదే సమయంలో సైనిక సేవ కాలాన్ని నాలుగు నెలల నుంచి 11 నెలలకు పెంచింది.
1,600 మంది యువత సైనిక సేవలోకి
కొత్తగా పొడిగించిన 11 నెలల సైనిక సేవలో భాగంగా ఈ వారం సుమారు 1,600 మంది యువత సైన్యంలో చేరారు. వీరిలో కొంతమందిని ఈ నెల చివర్లో తొలిసారిగా గ్రీన్‌ల్యాండ్‌కు పంపించే అవకాశం ఉంది. అక్కడ వారు సైనిక కార్యకలాపాలు, ఇతర రక్షణ సంబంధిత విధుల్లో పాల్గొనే అవకాశం ఉంది. ప్రిన్సెస్ ఇసబెల్లా సైన్యంలో చేరడం డెన్మార్క్ రాజకుటుంబంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. అదే సమయంలో మహిళలకు సైనిక సేవను తప్పనిసరి చేసిన డెన్మార్క్ విధానానికి కూడా ఆమె చేరిక ప్రతీకగా నిలిచింది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!