Israel-Iran War: మరింత ప్రమాదకరంగా ఇరాన్.. ఇజ్రాయిల్-యూఎస్ కథ అడ్డం తిరిగింది..
- ఖమేనీ మరణం తర్వాత మరింత ప్రమాదకరంగా ఇరాన్..
- ఇజ్రాయిల్ తాజా నివేదికలో సంచలన విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran War: వారం పది రోజుల్లో ఇరాన్ దారికి వస్తుందని భావించిన అమెరికా, ఇజ్రాయిల్‌ల కల కలగానే మిగిలింది. 40 రోజుల పాటు సాగిన యుద్ధంలో ఇరాన్ కన్నా అమెరికానే ఎక్కువ నష్టపోయింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) నివేదిక ఒకటి సంచలనంగా మారింది. ఇరాన్ కొత్త ప్రభుత్వం, పాత ప్రభుత్వం కన్నా ‘‘ప్రమాదకరం’’గా మారిందని ఇజ్రాయిల్ పార్లమెంట్ క్నెసెట్‌కు ఐడీఎఫ్ ఒక నివేదిక సమర్పించింది. యుద్ధం తొలిరోజే అప్పటి సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని హత్య చేసిన తర్వాత పరిస్థితులు తమకు అనుకూలంగా మారుతాయని భావిస్తే కథ అడ్డం తిరిగింది.
Read Also: Bengal Elections: “ముస్లింలను మోసం చేయడం సులభం”.. సంచలనంగా హుమాయున్ కబీర్ వీడియో..
Also Read
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రకారం, ఐడీఎఫ్ ప్రతినిధులు క్నెసెట్ విదేశీ వ్యవహారాలు మరియు రక్షణ కమిటీకి ఒక రహస్య నిఘా సమావేశంలో కొత్త పాలన గురించి వివరించారు. ప్రస్తుత పాలన నాయకులు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)తో సంబంధం కలిగి ఉందని, వీరు గత రాజకీయ నాయకత్వం కంటే మరింత తీవ్రవాద భావజాలాన్ని కలిగి ఉన్నారని కమిటీకి ఇజ్రాయిల్ మిలిటరీ తెలియజేసింది.
ఒకవేళ ఈ అంచనా నిజమైతే ఇది ఇజ్రాయిల్, యూఎస్‌కు అతిపెద్ద సవాలుగా మారుతుందని చెప్పారు. 40 రోజుల యుద్ధంతో ఇరాన్ నిలబడి పోరాడింది. సైనిక శక్తులైన ఇజ్రాయిల్, యూఎస్‌ను ఎదురించి దాడులు చేసింది. హార్ముజ్ జలసంధిని మూసేసి ప్రపంచ చమురు భద్రతను సవాల్ చేసింది. ఈ మొత్తం దాడిలో ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ ఇరాన్ లో 1000కి పైగా వైమానిక దాడులు చేసింది. మొత్తంగా 8500పైగా ఆపరేషన్ మిషన్లు పూర్తి చేసి, దాదాపుగా 400 లక్ష్యాలను కొట్టింది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!