Pope Leo-Trump: ట్రంప్ అంటే భయం లేదు.. యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటా.. పోప్ లియో ప్రకటన
- ట్రంప్ అంటే భయం లేదు
- యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటా
- పోప్ లియో ప్రకటన
- పోప్‌పై తీవ్ర విమర్శలు చేసిన ట్రంప్
- వాషింగ్టన్-వాటికన్ మధ్య ఉద్రిక్తతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాషింగ్టన్-వాటికన్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. పశ్చిమాసియా యుద్ధాన్ని పోప్ లియో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో పోప్ వ్యాఖ్యలపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్-వాటికన్ సిటీ మధ్య ప్రస్తుతం ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది.
తాజాగా ట్రంప్ బెదిరింపులపై పోప్ లియో స్పందించారు. తనకు ట్రంప్ భయం లేదని.. యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటానని తేల్చి చెప్పారు. 10 రోజుల ఆఫ్రికా పర్యటనలో భాగంగా అల్జీర్స్‌కు వెళ్తుండగా విమానంలో లియో మీడియాతో మాట్లాడారు. తాను ఎవరితోనూ నేరుగా ఘర్షణకు దిగబోనని.. అయితే మత బోధనలను దుర్వినయోగం చేయొద్దని కోరారు. ‘‘నేను యుద్ధానికి వ్యతిరేకంగా గళం విప్పుతూనే ఉంటాను. శాంతినే కోరుకుంటున్నా. సమస్యలకు న్యాయమైన పరిష్కరాలు కనుగొనడానికి దేశాల మధ్య సంభాషణను ప్రోత్సహిస్తాను. ఈ రోజు ప్రపంచంలో చాలా మంది బాధపడుతున్నారు. ఎంతో మంది అమాయకులు చంపబడుతున్నారు. దీనికో మంచి మార్గం ఉందని.. ఎవరొకరు ముందుకు వచ్చి చెప్పాలి.’’ అని పేర్కొన్నారు. ప్రపంచ నాయకులు శాంతి దిశగా అడుగులు వేయాలని.. హింసకు తావు ఇవ్వకూడదని పోప్ సూచించారు.
Also Read
- Explainer: పశ్చిమాసియాలో కొత్త తుఫాను? యుద్ధరంగంలోకి మోస్ట్ డేంజరస్ మొహిసిన్.. అమెరికా భయపడుతుందా?
- NASA ISRO Moon Base: చంద్రునిపై మానవ నివాసం.. ఇస్రోను ఆహ్వానించిన నాసా
- Nepal Violence: భారత సరిహద్దులో ఐఎస్ఐ కుట్ర? నేపాల్ అల్లర్లలో పాకిస్థానీ మత గురువు..
- Donald Trump: ‘‘ అల్లా దయ వల్ల.. హార్ముజ్ స్వాధీనం’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
పోప్ లియోను ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ ఘోరంగా విమర్శించారు. ‘‘పోప్ నేరాల విషయంలో బలహీనుడు. విదేశాంగ విధానంలో ఘోరమైనవాడు. అమెరికా అధ్యక్షుడిని విమర్శించే పోప్ నాకు వద్దు. ఎందుకంటే నేను ఏ పని కోసం ఎన్నికయ్యానో.. అదే పనిని భారీ మెజార్టీతో చేస్తున్నాను.’’ అని రాసుకొచ్చారు. అయినా ‘‘లియో కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకంటే అందరికీ తెలిసినట్లుగా అది ఒక అనూహ్యమైన ఆశ్చర్యం.’’ ‘‘పోప్ పదవికి సంబంధించిన ఏ జాబితాలోనూ లియో పేరు లేదు. కేవలం ఒక అమెరికన్ అయినందున అధ్యక్షుడు ట్రంప్‌తో వ్యవహరించడానికి ఉత్తమ మార్గం అని భావించినందునే ఆ పదవిలో నియమించింది..’’ అని ట్రంప్ రాసుకొచ్చారు. మొత్తానికి వాదోపవాదాల నేపథ్యంలో వైట్‌హౌస్-వాటికన్ మధ్య ఉద్రిక్తతలు నెలకున్నాయి.
ఇది కూడా చదవండి: Bihar: రేపే బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక.. ఎల్లుండి ప్రమాణస్వీకారం
తాజావార్తలు
-
Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
-
Sukhbir Singh Badal: నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై దాడి
-
Bank of America: అంబానీ కంపెనీపై అమెరికా బ్యాంక్ కన్ను.. రూ.18,268 కోట్ల భారీ డీల్!
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Saransh Jain: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో మజా లేదు.. సారాంశ్ జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!