PM Modi: 3 దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ తొలుత నైజీరియా చేరుకున్నారు. ఈ సందర్బంగా మోడీకి ఘన స్వాగతం పలికారు. నైజీరియాలో ఉన్న ప్రవాస భారతీయులు మోడీకి స్వాగతం పలికారు. ఈ క్రమంలో భారత ప్రధాని వారికి కరచాలనం చేస్తూ ముందుకు వెళ్లిపోయారు. కాగా, ఈ పర్యటన సందర్భంగా నరేంద్ర మోడీ నేడు (ఆదివారం) నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో సమావేశం కానున్నారు. ఆ భేటీలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధానంగా చర్చిస్తారు. ఆ తర్వాత జీ-20 సదస్సులో పాల్గొనేందుకు మోడీ బ్రెజిల్ వెళ్లనున్నారు. ఈ సదస్సు సందర్భంగా జీ-20 దేశాధినేతలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు.
Read Also: Pushpa – 2 : RRR ట్రైలర్ రికార్డును పుష్ప – 2 బ్రేక్ చేసేనా..?
అలాగే, ఈ నెల 19వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గయానాకు వెళ్లనున్నారు. గయానా అధ్యక్షుడైన మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ అహ్వానం మేరకు మోడీ ఆ దేశంలో నవంబర్ 21వ తేదీ వరకు ఉండనున్నారు. గయానాలో జరగనున్న భారత్- కరికోమ్ సదస్సులో కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని భారత ప్రధానికి ప్రదానం చేయనుంది. అయితే, 17 ఏళ్ల తర్వాత భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక, 50 ఏళ్ల తర్వాత భారత ప్రధాని గయానాలో పర్యటించటం గమనార్హం.
Read Also: Koti Deepotsavam 2024 Day 8 : సకలాభీష్టాలు ప్రసాదించే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కల్యాణోత్సవం
ఇక, నవంబర్ 18, 19 తేదీల్లో రియో డీజెనిరోలో జరిగే జీ-20 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తదితరులు హాజరుకానున్నారు. ప్రస్తుతం ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా జీ-20 ట్రోకాలో భాగంగా కొనసాగుతున్నాయి. గతేడాది భారత్‌లో జీ-20 సదస్సు జరిగ్గా.. ఇప్పుడు బ్రెజిల్‌లో జరగబోతుంది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జీ-20 కూటమి శిఖరాగ్ర సమావేశం కానుంది.