Palm oil: గుడ్ న్యూస్.. పామాయిల్ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాకు గుడ్ న్యూస్. రాబోయే కాలంలో వంట నూనెల ధరలు దిగిరానున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద పామాయిల్ ఎగుమతిదారుగా ఉన్న ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసింది. దీంతో ఇండో నేషియా నుంచి ఇకపై వివిధ దేశాలకు పామాయిల్ ఎగుమతి కానుంది. ఈ విషయాన్ని ఇండోనేషియా జోకో విడొడో తెలిపారు. ఇండోనేషియాలో ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో ఎప్రిల్ 28న పాయాయిల్ ఎగుమతులపై నిషేధం విధించింది అక్కడి సర్కార్. పామాయిల్ వ్యాపారుల నుంచి వస్తున్న ఒత్తడితో అక్కడి ప్రభుత్వం దిగి వచ్చింది. మే 23 నుంచి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తేసింది.
గత నెలలో తమ ప్రజలకు ఆయిల్ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఇండోనేషియా ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం విధించింది. ఇండోనేషియా తన పామాయిల్ ఉత్పత్తిలో కేవలం 35 శాతం మాత్రమే వాడుకుంటుంది. మిగతాది విదేశాలకు ఎగుమతి చేస్తోంది. అయితే ఎగుమతులపై నిషేధం విధించడంతో పామాయిల్ ఉత్పత్తుల నిల్వలు భారీగా పెరిగిపోయాయి. దీంతో దేశంలో ఈ రంగంపై ఆధారపడుతున్న 17 మిలియన్ల కార్మికులు సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ఇండోనేషియాలో నిషేధానికి ముందు పామాయిల్ ధర అక్కడి కరెన్సీ ప్రకారం లీటరుకు 19,800 రూపియా ($1.35) ఉంటే దాదాపు 17,200 రూపాయలకు ($1.17) తగ్గింది. నిషేధం తర్వాత దేశీయ వంటనూనెల సరఫరా కూడా మూడు రెట్లు పెరిగి నెలకు 64,500 టన్నుల నుంచి 211,000 టన్నులకు పెరిగిందని అధ్యక్షుడు విడిడో తెలిపారు.
ఇండియా పామాయిల్ దిగుమతుల కోసం ఇండోనేషియా పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. భారత్ తన అవసరాల్లో 70 శాతం ఇండోనేషియా, 30 శాతం మలేషియా నుంచే పామాయిల్ దిగుమతి చేసుకుంటోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇండియా 83. 1 లక్షల టన్నుల పామాయిల్ ను దిగుమతి చేసుకుంది. మరో వైపు సన్ ప్లవర్ అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్న ఉక్రెయిన్ ప్రస్తుతం రష్యాతో యుద్ధంలో ఉంది. దీంతో గత కొన్ని నెలలుగా దేశంలో పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం ఇండోనేషియా నిర్ణయంతో వంట నూనెల ధరలు దిగిరానున్నాయి.
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!