Pakistan Terror Attack: పాకిస్థాన్‌లో ఘోర ఉగ్రదాడి.. DSP, సబ్ ఇన్స్పెక్టర్ సహా 10 మంది పోలీసుల మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Terror Attack: పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP), సబ్-ఇన్స్పెక్టర్ సహా కనీసం 10 మంది పోలీసు సిబ్బంది మృతి చెందారు. బుధవారం జరిగిన ఈ ఘటనలో అక్రమ బంగారం తవ్వకాలపై చర్యలు తీసుకునేందుకు వెళ్తున్న పోలీసు బృందంపై ఉగ్రవాదులు మాటువేసి దాడి చేశారు.
కోహాట్, కరక్ జిల్లాల మధ్య ఉన్న దర్బోకచ్ జలంధర్ బండా ప్రాంతంలో ఈ దాడి జరిగింది. పోలీసు ప్రతినిధి మహమ్మద్ నౌమాన్ జెబ్ తెలిపిన వివరాల ప్రకారం, పోలీసు బృందం కోహాట్ జిల్లాలోని గుంబాట్ ప్రాంతానికి వెళ్తుండగా దుండగులు అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించారు. దాడి చేసిన వారు కొండ ప్రాంతాల్లోని ఎత్తైన ప్రదేశాల నుంచి పోలీసులపై కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో పలువురు పోలీసులు ప్రాణాలు కోల్పోగా, పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు.
Also Read
- Qualcomm Layoffs: హైదరాబాద్ సహా భారత్‌లో క్వాల్కామ్ ఉద్యోగులకు బిగ్ షాక్..
- Anthropic CEO: 10 ఏళ్లలో క్యాన్సర్ లేని ప్రపంచం.. ఏఐపై భారీ అంచనాలు..
- Alcohol Sales: అమెరికా, చైనాను మించి భారతీయులే అతిపెద్ద తాగుబోతులు!
- Netanyahu vs Gadi Eisenkot: సిగ్గుచేటు.. రామ్, జాయింట్ లిస్ట్ పార్టీలపై నెతన్యాహు ఆగ్రహం..
మృతుల్లో DSP గంబాట్ హైదర్ జమాన్, సబ్-ఇన్స్పెక్టర్ ముఖ్తియార్తో పాటు ఇతర పోలీసు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. దాడి సమయంలో ఉగ్రవాదులు ఐదు పోలీసు మొబైల్ వాహనాలకు నిప్పు పెట్టారు. అనంతరం పోలీసు బృందంపై కాల్పులు కొనసాగించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర కాల్పులు జరిగినట్లు పోలీసు ప్రతినిధి తెలిపారు. దాడి సమాచారం అందిన వెంటనే అదనపు పోలీసు వాహనాలు, భారీ సంఖ్యలో భద్రతా బలగాలను ఘటనా స్థలానికి తరలించారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు, వారిపై చర్యలు తీసుకునేందుకు భద్రతా చర్యలను మరింత ముమ్మరం చేశారు.
ఖైబర్ పఖ్తుంఖ్వా గవర్నర్ ఫైసల్ కరీం కుండీ ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడి నేరస్థులు, ఉగ్రవాదుల మధ్య ఉన్న సంబంధాన్ని ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించారు. మృతి చెందిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారుల సేవలను ఆయన కొనియాడారు.
ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌లో జరిగిన ఈ దాడి జరిగిన రోజే జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భద్రతా సిబ్బందిపై మరో దాడి జరిగింది. మిర్బజార్ సమీపంలోని అఖ్రాన్ ప్రాంతంలో ఉన్న CRPF చెక్‌పాయింట్‌పై మోటార్‌సైకిళ్లపై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. బుధవారం మధ్యాహ్నం సుమారు 2:15 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో ముగ్గురు CRPF సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన వారిని అనంత్‌నాగ్‌లోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దాడి అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, దుండగులను పట్టుకునేందుకు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
తాజావార్తలు
-
Pakistan Terror Attack: పాకిస్థాన్‌లో ఘోర ఉగ్రదాడి.. DSP, సబ్ ఇన్స్పెక్టర్ సహా 10 మంది పోలీసుల మృతి
-
Astrology: నవంబర్ 12 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్
-
CII Summit: విశాఖ సీఐఐ సమ్మిట్‌లో సందడి.. పారిశ్రామికవేత్తల ఆవిష్కరణలను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్..
-
IPL 2028: ఐపీఎల్ 2028లో 12 జట్లు..? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..
-
Team India Squad: నవంబర్ 30 నుంచి ఇంగ్లాండ్‌తో సమరం.. జట్టు ప్రకటన..
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!