Pakistan: పాకిస్తాన్లో మారణహోమం.. వేర్వేరు ఘటనల్లో 18 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ వరసగా తీవ్రవాద దాడులతో అట్టుడుకుతోంది. ముఖ్యంగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో మిలిటెంట్లు విరుచుకుపడుతున్నారు. ఈ రెండు ప్రావిన్సుల్లో గత రెండు రోజులుగా జరిగిన దాడుల్లో మొత్తం 18 మంది మరణించారు. ఇందులో ఆరుగురు భద్రతా సిబ్బంది ఉండగా.. 12 మంది ఉగ్రవాదులు ఉన్నారు. సీనియర్ పోలీస్ అధికారితో సహా ఆరుగురు పోలీసులు మరణించినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. బలూచిస్తాన్ ప్రావిన్సులో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు పాకిస్తాన్ సాయుధ దళాల మీడియా విభాగం తెలిపింది.
ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని కులాచీ తహసిల్‌లోని కోట్ సుల్తాన్ ప్రాంతంలో భద్రతా దళాల కాల్పుల్లో 8 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపారు. హతమైన ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని లక్కీ మార్వాత్‌లో శుక్రవారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఒక సాయుధ దుండగుడు, డీఎస్పీ, ఇద్దరు పోలీసులు మరణించగా ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు.
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
Read Also: Akhilesh Yadav: గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ కుటుంబాన్ని పరామర్శించిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్..
రంజాన్ పండగ సందర్భంగా పోలీస్ భద్రత తనిఖీల్లో భాగంగా రద్దీగా ఉండే పెషావర్-కరాచీ హైవేపై డీఎస్పీ గుల్ మహ్మద్, ఇతర పోలీసులతో కలిసి తాత్కాలిక తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వారు చెక్ పాయింట్ నుంచి తిరిగి వస్తుండగా.. మంజివాల చౌక్ సమీపంలో పోలీస్ వ్యాన్‌పై సాయుధ వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో డీఎస్పీతో సహా పలువురు పోలసీులు మరణించారు.
లక్కీ మార్వాట్లో పోలీసులపై జరిగిన దాడిని ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. ఇది ఉగ్రవాదుల పిరికి చర్యగా అభివర్ణించారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా సీఎం అలీ అమీన్ గుండాపూర్ కూడా తీవ్రవాద దాడిని ఖండించారు. ఆగస్టు 2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారాన్ని తాలిబాన్లు చేజిక్కించుకున్న తర్వాత రెండు దేశాల సరిహద్దులో ఉండే ఈ ప్రావిన్సు తీవ్రవాద దాడుల్ని ఎదుర్కొంటోంది. పాక్ తాలిబాన్లు ఆర్మీ, పాక్ పోలీసులు టార్గెట్‌గా దాడులకు తెగబడుతున్నారు. మరోవైపు బలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇదే విధంగా దాడులు జరుపుతోంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!