Pakistan: పాకిస్తాన్ అంతర్జాతీయంగా తాను పెద్ద దేశాన్ని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ, దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో పట్టించుకోవడం లేదు. తాజాగా, ట్రంప్ ప్రతిపాదితన గాజాకు సంబంధించిన ‘‘బోర్డ్ ఆఫ్ పీస్‘‘లో చేరిన 8 ముస్లిం దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉంది. యుద్ధంతో దెబ్బతిన్న గాజాలో శాశ్వత కాల్పుల విరమణ, పునర్నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ఈ బోర్డును ఏర్పాటు చేశాడు. దీంట్లో చేరుతున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది.
Read Also: Air India Loss: టాటా గ్రూప్‌కు ఎయిర్ ఇండియా షాక్.. ఏకంగా రూ.15 వేల కోట్ల భారీ నష్టం! రీజన్ ఇదే..
ఇక్కడ పాకిస్తాన్ దరిద్రం ఏంటంటే, ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’లో శాశ్వత సభ్యుడిగా చేరడానికి దాదాపు 1 బిలియన్ డాలర్లను(దాదాపు ₹8,300 కోట్లు) చెల్లిస్తోంది. ఈ డబ్బుల్ని చెల్లించేందుకు కూడా పాక్ సిద్ధమైంది. ఇదే సమయంలో యూఏఈ నుంచి 2.2 బిలియన్ డాలర్ల అప్పును కోరుతోంది. మరోవైపు, ఐఎంఎఫ్ నుంచి 7 బిలియన్ డాలర్ల రుణ పథకం కొనసాగింపు కోసం ప్రయత్నిస్తోంది.
పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. అయినా కూడా అంతర్జాతీయ వేదికలపై గప్పాలు కొడుతోంది. విదేశీ మారక నిల్వలు పడిపోయాయి, ఆ దేశంలో ద్రవ్యోల్భణం, నిరుద్యోగాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గాజా శాంతి బోర్డులో గొప్పల కోసం చేరడం అవసరమా అని పాక్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ బోర్డులో సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్, ఇండోనేషియా, ఖతర్, యూఏఈ, పాకిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రతీ శాశ్వత సభ్య దేశం భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ నిర్ణయాన్ని పాక్ సమర్థించుకుంటుంది. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ.. గాజా శాంతి ప్రణాళికకు మద్దతు ఇచ్చే కీలక వేదిక అని, శాశ్వత కాల్పుల విరమణ దిశగా ఇది సహాయపడుతుందని అన్నారు.
