Pakistan: పాకిస్తాన్ అంతర్జాతీయంగా తాను పెద్ద దేశాన్ని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ, దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో పట్టించుకోవడం లేదు. తాజాగా, ట్రంప్ ప్రతిపాదితన గాజాకు సంబంధించిన ‘‘బోర్డ్ ఆఫ్ పీస్‘‘లో చేరిన 8 ముస్లిం దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉంది. యుద్ధంతో దెబ్బతిన్న గాజాలో శాశ్వత కాల్పుల విరమణ, పునర్నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ఈ బోర్డును ఏర్పాటు చేశాడు. దీంట్లో చేరుతున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది.…