Pakistan: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించిన పాకిస్తాన్ నుంచి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక పాకిస్తానీ యువతి తాను ట్రంప్ కుమార్తెనంటూ మీడియా ముందుకు వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారిపోయింది. ఆ వీడియోలో సదరు యువతి తాను ముస్లింనని చెప్తునే.. తానే డొనాల్డ్ ట్రంప్ నిజమైన కుమార్తెనని చెప్పుకొచ్చింది. అలాగే, ఈ వీడియో ప్రామాణికతో పాటు ఆ యువతి మానసిక స్థితి గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం వెలుగులోకి రాలేదు. కాగా, మీడియాతో మాట్లాడిన ఆ యువతి ఇంగ్లీషు వాళ్లు ఇక్కడికి వచ్చినప్పుడు తనను చూసి ఆశ్చర్యపోతుంటారని వెల్లడించింది.
Read Also: ManiRatnam : థగ్ లైఫ్ ఫస్ట్ గ్లింప్స్.. వింటేజ్ కమల్ బ్యాక్
కాగా, తన కూతురిని బాగా చూసుకోలేకపోతున్నానని డొనాల్డ్ ట్రంప్ తన తల్లితో ఎప్పుడూ అంటుంటారని ఆమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనింది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్’ (ట్విట్టర్)లో @Pakistan_untold ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 75 వేలకు పైగా వీక్షణలు వచ్చాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ను ఓడించి, డొనాల్డ్ ట్రంప్ తిరిగి రెండోసారి అధ్యక్షునిగా ఎంపికయ్యారు.
Does @realDonaldTrump know he has children in Pakistan who speak Urdu & English in Punjabi? pic.twitter.com/anhRKbiLGo
— Pakistan Untold (@pakistan_untold) November 6, 2024