NTV Telugu Site icon

Pakistan Economic Crisis: పాకిస్తాన్ దివాళా తీసింది.. రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

Pakistan

Pakistan

Pakistan Economic Crisis: పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అక్కడి ప్రజలు గోధుమ పిండి, గ్యాస్, పెట్రోల్ ధరలు పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాకిస్తాన్ ఈ పరిస్థితుల నుంచి తమను కాపాడాలని ఐఎంఎఫ్ ని అడుగుతోంది. ఇటీవల పదిరోజుల పాటు అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)తో పాక్ ప్రభుత్వం చర్చలు జరిపింది. పాక్ ఆర్థిక సంస్కరణలు చేపట్టి పన్నులు పెంచితే తప్పా బెయిలౌట్ ప్యాకేజ్ ఇచ్చేది లేదని ఐఎంఎఫ్ తెగేసి చెప్పింది. ప్రస్తుతం పాకిస్తాన్ లో లీటర్ పాల ధర రూ. 250, కిలో చికెన్ రూ. 780కి చేరుకున్నాయి. ఇక పెట్రోల్, డిజిల్ రేట్లు ఎప్పుడు రూ. 250ని దాటేశాయి.

READ ALSO: Sonu Sood : దేశంలోనే అతిపెద్ద మండి ప్లేటు.. ఆవిష్కరించిన సోనూసూద్

ఇదిలా ఉంటే పాకిస్తాన్ దివాళా తీసిందని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రొట్టెలు, నీళ్ల కోసం కూడా ప్రజలు ఇబ్బందుల పడుతున్నారని.. దేశంలో ద్రవ్యోల్భణం రికార్డు స్థాయిలో నమోదు అవుతోందని, పాకిస్తాన్ ఇప్పటికే డిఫాల్ట్ అయిందని అన్నారు. సియాల్ కోట్ లో జరిగిన కాన్వోకేషన్ ఈవెంట్ లో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా మనకాళ్లపై మనం నిలబడాలని ఆయన అన్నారు. టెర్రరిజం పాకిస్తాన్ విధిగా మారిందని..మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ టెర్రరిజాన్ని రెచ్చగొట్టి మళ్లీ పాకిస్తాన్ కు తిరిగి వచ్చేలా చేశారంటూ విమర్శించారు.

తాము ఐఎంఎఫ్ సాయం కోసం ఎదురుచూస్తున్నామని ఖ్వాజా ఆసిఫ్ అన్నారు. ప్రస్తుతం ఖ్వాజా చేసిన దివాళా వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో పాకిస్తాన్ లో వైరల్ గా మారాయి. దీంతో ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నాయి అక్కడి ప్రతిపక్షాలు. కేవలం 10 నెలల్లోనే ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ను తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి తీసుకెళ్లారని విమర్శలు గుప్పించారు.