Pakistan: పాకిస్తాన్ తన క్షిపణి ప్రయోగాలను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ సైన్యం రహస్యంగా ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్(ICBM)ను తయారు చేస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థలు తెలిపాయి. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఈ క్షిపణి ఏకంగా అమెరికాను కూడా చేరుకోగలదని నివేదిక చెప్పింది. భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాత, పాకిస్తాన్ చైనా సాయంతో తన అణ్వాయుధ సామాగ్రిని అప్‌గ్రేడ్ చేయాలని చూస్తోందని ఫారిన్ ఎఫైర్ నివేదిక తెలియజేసింది. పాకిస్తాన్ అలాంటి క్షిపణిని తయారు చేయడం కొనసాగిస్తే, అమెరికా ఆ దేశాన్ని అణ్వాయుధ ప్రత్యర్థిగా గుర్తిస్తుందని అమెరికా అధికారులను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.
Read Also: Central Cabinet Decisions: బీహార్‌పై ప్రత్యేక ఫోకస్.. తొలి అణు విద్యుత్ ప్లాంట్‌కు ఆమోదం
అమెరికాకు సంభావ్య ముప్పు లేదా ప్రత్యర్థిగా పరిగణించబడే అణ్వాయుధాలను కలిగి ఉన్న ఏ దేశాన్ని అయిన అణ్వాయుధ ప్రత్యర్థిగా పరిగణిస్తుంది. ప్రస్తుతం రష్యా, చైనా, ఉత్తర కొరియాలనున అమెరికా తన విరోధులుగా పరిగణిస్తోంది. పాకిస్తాన్ అమెరికాను తాకగలిగే సత్తా కలిగిన ఇంటర్ కాంటినెంటర్ బాలిస్టిక్ మిస్సైల్ (ICBM) తయారు చేసుకుంటే, అమెరికా ఆదే శాన్ని అణ్వాయుధ ప్రత్యర్థిగా పరిగణించడం తప్ప వేరే మార్గం ఉండదు. అమెరికాను చేరుకోగలిగే ICBMలు కలిగిన ఏ దేశాన్ని కూడా అమెరికా తన స్నేహితుడిగా పరిగణించని అమెరికా అధికారులను ఉటంకిస్తూ నివేదిక వెల్లడించింది.
అణు మరియు సాంప్రదాయ వార్‌హెడ్‌లతో ఆయుధాలు కలిగి ఉండే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణులు (ICBMలు) 5,500 కి.మీ కంటే ఎక్కువ లక్ష్యాలను ఛేదించగలవు. ప్రస్తుతం, పాకిస్తాన్ వద్ద ICBMలు లేవు. పాకిస్తాన్ సర్ఫేస్ టూ సర్ఫేస్ క్షిపణి అయిన మీడియా రేంజ్ బాలిస్టిక్ క్షిపణి షాహీన్ -3ని 2022లో పరీక్షించింది. దీని పరిధి 2700 కి.మీ, దీని పరిధిలో భారతదేశంలోని అనేక నగరాలు ఉన్నాయి.
