Pakistan: పాకిస్తాన్ తన క్షిపణి ప్రయోగాలను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ సైన్యం రహస్యంగా ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్(ICBM)ను తయారు చేస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థలు తెలిపాయి. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఈ క్షిపణి ఏకంగా అమెరికాను కూడా చేరుకోగలదని నివేదిక చెప్పింది.