Pakistan: ట్రంప్‌ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
- ట్రంప్‌ను మోసం చేస్తున్న పాకిస్తాన్..
- ఇరాన్‌కు 6 భూమార్గాలను తెరిచిన ఇస్లామాబాద్..
- అమెరికా దిగ్బంధనం నుంచి తప్పించుకునే ఛాన్స్..
Pakistan: ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య డీల్ కుదిర్చేందుకు ఇస్లామాబాద్ వేదికగా ఇప్పటికే ఒకసారి ఇరు దేశాల బృందాలు సమావేశమయ్యాయి. రెండో దశ సమావేశాలు విఫలమయ్యాయి. ఇదిలా ఉంటే, మరోవైపు ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా హార్ముజ్ దిగ్బంధంతో పాటు ఇరాన్ పోర్టుల్ని బ్లాక్ చేస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఒప్పందం సాధ్యపడటం లేదు.
Read Also: Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే
Also Read
- Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్‌తో సమావేశం
- Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య 90 నిమిషాలు కాల్ సంభాషణ.. ఏం చర్చించారంటే..!
- Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్‌నకు ఇరాన్ వార్నింగ్
- Zohran Mamdani-King Charles: కోహినూర్ వజ్రం భారత్‌కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్‌కు మమ్దానీ విజ్ఞప్తి!
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ మాత్రం తన జిత్తులమారితనాన్ని చూపిస్తోంది. ఓ వైపు అమెరికా వైపు ఉన్నామంటూనే, ఇరాన్‌కు సహాయం చేస్తోంది. పాకిస్తాన్, రష్యా, చైనా, ఇతర దేశాలతో వాణిజ్యం చేయడానికి ఇరాన్‌కు 6 భూమార్గాలను తెరిచింది. ఇరాన్‌కు పాకిస్తాన్ సరిహద్దు దేశం కావడంతో, పాకిస్తాన్ ద్వారా నేరుగా అరేబియా సముద్రం ద్వారా ఇరాన్ వ్యాపారం చేయడానికి మార్గం సుగమమైంది. ఈ పరిణామాలపై అమెరికా జాతీయ భద్రతా నిపుణుడు డెరెక్ జె గ్రాస్మాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ వ్యూహాన్ని పాకిస్తాన్ దెబ్బతీస్తోందని అన్నారు.
పాకిస్తాన్ మధ్యవర్తిత్వం గురించి మొదటి నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. యూఏఈ వంటి గల్ఫ్ దేశానికి కూడా పాక్ మధ్యవర్తిత్వం నచ్చడం లేదు. ఇరాన్‌పై పాక్ మెతక వైఖరి అవలంభిస్తున్నారని యూఏఈ మండిపడుతోంది. మధ్యవర్తిత్వంలో పాక్‌కు విశ్వసనీయత లేదని ఇజ్రాయిల్ ఆరోపించింది. ఇరాన్‌కు పాకిస్తాన్ 6 భూ మార్గాలను తెరవడం ట్రంప్ వ్యూహాన్ని దెబ్బతీసింది. ఇరాన్ వెళ్లాల్సిన 3000కు పైగా కార్గో కంటైనర్లు పాకిస్తాన్ ఓడరేవుల్లో క్లియరెన్స్ కోసం వేచి ఉన్నట్లు పలు నివేదికలు సూచిస్తున్నాయి.
Trump admin, you have a problem. Your good friend Pakistan appears to have just opened six overland links to Iran, helping the regime bypass your counter-blockade in the Strait of Hormuz. This will help Iran continue to resist US pressure. Islamabad double deals America…AGAIN! pic.twitter.com/gbNZeuQy0G
— Derek J. Grossman (@DerekJGrossman) April 29, 2026
తాజావార్తలు
-
Pakistan: ట్రంప్‌ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
-
OTT Movies : థియేటర్స్‌లో చిన్న చిత్రాలు.. దెబ్బ కొడుతున్న ఓటీటీ సినిమాలు
-
Riyan Parag: బిగ్ షాక్.. రియాన్ పరాగ్‌పై తీవ్ర చర్యలు.. ఊహించని విధంగా..
-
Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
-
Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!