Site icon NTV Telugu

India-Pakistan War: వెనక్కి తగ్గిన పాకిస్తాన్‌..! భారత్‌ ముందు కీలక ప్రతిపాదన..

Ishaq Dar

Ishaq Dar

India-Pakistan War: భారత్-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్త వాతారణం నెలకొంది.. దాడులు, ప్రతిదాడులు.. దాడులను తిప్పికొట్టడం ఇలా దేశాల సరిహద్దుల్లో యుద్ధమే నడుస్తోంది.. పహల్గామ్‌ దాడికి ప్రతీకారం భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో దాడులకు దిగగా.. భారత్‌ దాడులను తట్టుకోలేక పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే పలు ఆర్మీ బేస్‌లతో పాటు సరిహద్దుల్లోనూ భారీగా నష్టాన్ని చవిచూసిన పాకిస్తాన్.. ఇప్పుడు ఓవైపు దాడులు చేస్తూనే.. మరోవైపు భారత్‌లో కాళ్ల బేరానికి వచ్చినట్టే కనిపిస్తోంది.. పాకిస్తాన్‌ ఉప ప్రధాని, విదేశాంగమంత్రి ఇషాక్‌ దార్.. భారత్‌ ముందు ఓ కీలక ప్రతిపాదన పెట్టారు..

Read Also: Vennela Kishore : అప్పటిదాకా డైరెక్షన్ చేయను!

భారత్‌-పాకిస్తాన్‌ ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధమని ప్రకటించారు పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌.. పాకిస్తాన్‌పై భారత్ దాడులు ఆపితే.. తామూకూడా ఆపుతాం అని వెల్లడించారు.. భారత్ దాడులు ఆపితే ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధం అని పేర్కొన్నారు.. ఇదే విషయాన్ని అమెరికాకు స్పష్టం చేశామని వెల్లడించారు పాక్ విదేశాంగ మంత్రి ముహమ్మద్ ఇషాక్ దార్.. కాగా, ఈ రోజు పాక్ ఆర్మీ చీఫ్ కు ఆమెరికా విదేశాంగ మంత్రి రుబియా ఫోన్‌ చేసిన విషయం విదితమే.. కాల్పులు విరమించాలని పాక్‌ను కోరారు ఆమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో.. మరోవైపు.. భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌కు అమెరికా విదేశాంగ మంత్రి రుబియో ఫోన్‌ చేసి… ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు.. ఉద్రిక్తతలు తగ్గించుకునే చర్యలు చేపట్టాలని రుబియో సూచించిన విషయం విదితమే..

Read Also: No Firecrackers : హైదరాబాద్‌లో బాణసంచా కాల్చడం నిషేధం..

కానీ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నంలో పాక్‌ ఉంది.. భారత బలగాలను రెచ్చగొడుతూనే ఉంది.. సరిహద్దుల వెంట ముందుకు చొచ్చుకొచ్చాయి పాక్‌ బలగాలు.. ఇదే సమయంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఇండియన్‌ ఆర్మీ సిద్ధం అయ్యింది.. ఇక, జైసల్మేర్ టార్గెట్‌గా పాక్ దాడులకు పూనుకుంది.. జైసల్మేర్ వ్యాప్తంగా ఉదయం నుంచే ఖాళీ చేయిస్తున్నారు పోలీసులు, ఆర్మీ.. జైసల్మేర్ కు 6 కి.మీ పరిధిలో ఉన్న గిడా గ్రామంలో మిస్సైల్స్ ను భారత ఆర్మీ కూల్చివేసింది.. ప్రజలెవరూ బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేసింది.. జైసల్మేర్ ప్రధాన రహదారులను ఖాళీ చేయించాయి భద్రతాదళాలు.. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఒక్కరు కూడా బయటకు రావొద్దని స్పష్టం చేసింది.. రెండు రోజుల పాటు రాత్రి సమయంలోనే దాడులకు పాల్పడిన పాక్.. ఈ రోజు తన పంతాను మార్చి.. ఉదయం నుంచి దాడులు కొనసాగిస్తోంది.. ఇప్పుడు పాక్‌ విదేశాంగ మంత్రి ప్రతిపాదనతో కాళ్ల బేరానికి వచ్చినట్టే కనిపిస్తున్నా.. బోర్డర్‌ నుంచి వెనక్కి తగ్గుతుందా? ఇంకా ఉధృతం చేస్తుందా అనేది తేలాల్సి ఉంది..

Exit mobile version