Site icon NTV Telugu

Pakistan: పాకిస్తాన్‌ను కుదిపేస్తున్న కొత్త సంక్షోభం..

Pak

Pak

Pakistan: పాకిస్తాన్ ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అయితే, ఇప్పుడు ఆర్థిక సంక్షోభానికి అనుగుణంగా పాక్ ప్రజలు మరో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. పాక్ కుటుంబాలు తమ ఆదాయంలో మూడింట రెండు వంతుల్ని ఆహారం, విద్యుత్ వంటి వాటికే చెల్లించాల్సి వస్తోంది. దీని కారణంగా విద్య, ఆరోగ్యం, దీర్ఘకాలిక అవసరాలకు ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడిందని కొత్త ప్రభుత్వ సర్వే తెలియజేస్తోంది.

Read Also: Nandyal: చాగలమర్రి మండలం మద్దూరులోని.. వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీలో వీడిన మిస్టరీ..

హౌస్‌హోల్డ్ ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్ సర్వే 2024–25 ప్రకారం.. ద్రవ్యోల్బణం, ఆర్థిక నిర్వహణ లోపాలు గృహ ప్రాధాన్యతల్ని తగ్గిస్తున్నాయి. స్థిరమైన ధరల ఒత్తిళ్లు, విద్యుత్, గ్యాస్ ఛార్జీల పెరుగుదల, జీవన వ్యయం భారీగా పెరగడం మొత్తంగా పాక్ ప్రజల్ని జీవన విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. ఆదాయం పెరిగినప్పటికీ, ఆదాయాన్ని మించిన వేగంతో ఖర్చులు కూడా పెరుగుతున్నాయని నివేదిక పేర్కొంది.

ఆదాయంలో 63 శాతం కేవలం రెండు అవసరాలకు మాత్రమే అక్కడి ప్రజలు వినియోగిస్తున్నారు. 37 శాతాన్ని ఆహారం, 26 శాతాన్ని విద్యుత్ , గ్యాస్‌లకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యపై 2.5 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నారు. విద్యా, ఆరోగ్యం, వినోదంపై అంతా కలిపి 7 శాతం వద్దనే నిలిచిపోయింది. ఇది మానవ అభివృద్ధిపై తీవ్రమైన ఆందోళనను లేవనెత్తుతోంది. గత 6 ఏళ్లలో పాకిస్తాన్‌లో నెలవారీ జీతాలు సగటున 41,500 పాక్ రూపాయల నుంచి 82,000 వరకు పెరిగినప్పటికీ, ఖర్చులు ఏకంగా 19 శాతానికి పెరిగాయి. ఇది ప్రజల కొనుగోలు శక్తిని క్షీణించేలా చేసింది. వీటన్నింటికి తోడు మధ్య, ఆధాయ అసమానతలు కూడా తీవ్రంగా పెరిగాయి. ధనవంతులు, అత్యంత పేదల కన్నా మూడు రెట్లుకు పైగా ఎక్కువ సంపాదిస్తున్నారు.

Exit mobile version