Leopard Attack Tirumala: తిరుమలలో మరోసారి చిరుత పులి అలజడి కలకలం రేపుతుంది. అలిపిరి-ఎస్వీ పార్క్ జూ రోడ్డులో వెళ్తున్న బైకర్లపై ఒక్కసారిగా దాడికి చిరుత యత్నించింది. అయితే అదృష్టవశాత్తూ వారు తృటిలో తప్పించుకోగా.. కాగా, ప్రమాద సమయంలో బైకర్ల వెనుక వెళ్తున్న కారులో ఉన్న ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్‌లో ఈ విజువల్స్ ను రికార్డు చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శ్రీవారి భక్తులను ఆందోళనకు గురి చేస్తుంది.
Read Also: CM Chandrababu: నేడు సింగపూర్కు సీఎం చంద్రబాబు.. పెట్టుబడులే లక్ష్యంగా పర్యటన
అయితే, ఇప్పటికే ఇదే మార్గంలో పలుమార్లు చిరుతలు దర్శనమిచ్చిన ఘటనలు అనేకం ఉన్నాయి. వరుసగా జరుగుతున్న చిరుతల సంచారంతో అలిపిరి – జూ పార్క్ రూట్ మీద ప్రయాణించే భక్తులు భయపడుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళలలో బైక్‌లపై ప్రయాణించేవారు తమ ప్రాణాలపై ప్రమాదం ముంచుకొస్తోందని పేర్కొంటున్నారు. ఈ పరిణామాలపై అటవీశాఖ అధికారులు, పోలీసులు వెంటనే స్పందించి.. ఈ ప్రాంతాల్లో చిరుతల పర్యటనపై మున్ముందు నిఘా ఉంచడంతో పాటు భక్తులకు భద్రత కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.