Pakistan: “మ్యాన్‌హోల్స్” దొంగలతో పాకిస్తాన్ కంగారు.. భారీ శిక్షలు ప్రకటించిన దాయాది..
- పాక్‌ను కంగారు పడుతున్న ‘‘మ్యాన్‌హోల్’’ దొంగలు..
- మూతలు దొంగిలిస్తే 10 ఏళ్ల జైలు, 50 లక్షలు ఫైన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌ను కొత్తగా మరో విషయం చిరాకు పెడుతోంది. చివరకు ఆ దేశంలోని దొంగలు ‘‘మ్యాన్ హోల్స్’’పై మూతలు కూడా ఉంచకుండా, దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీంతో విసిగిపోయిన పాకిస్తాన్, భారీ శిక్షల్ని ప్రకటించింది. మ్యాన్‌హోల్స్‌కు ఇలాంటి శిక్షలు ఏమిటి..? అని అనుకున్నా సరే, ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్ మాత్రం శిక్షలు విధించేందుకు చట్టాన్ని తీసుకువచ్చింది.
మ్యాన్ హోట్స్ మూతలు దొంగిలిస్తే శిక్షగా 10 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల పాకిస్తానీ రూపాయలు జరిమానా విధించనున్నారు. ఈ చట్టానికి ‘‘గట్టర్ చట్టం’’ అని పిలుస్తున్నారు. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పంజాబ్ ప్రావిన్స్ సీఎం మరియం నవాజ్ ఈ శిక్షల గురించి హెచ్చరిస్తూ మాట్లాడుతున్న వీడియో వైరల్ అవుతోంది.
Also Read
- India-Iran Trade: ఇరాన్‌తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
- Explainer: టార్గెట్ ఇండియా? పాక్‌కు బాంబులు పంపుతున్న టర్కీ!
- US Iran Sanctions: ఇరాన్‌తో ఆయిల్ డీల్స్.. 4 భారతీయ కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు! అసలు కారణం ఇదే
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
‘‘మేము ఉదయం మూతల్ని బిగిస్తాము, సాయంత్రానికి అవి మాయమైపోతాయి. మురుగు కాలువ మూతల్ని దొంగిలించవద్దు’’ అని ఆమె కోరారు. మ్యాన్ హోల్స్ దొంగతనాలపై ఆమె విచారం వ్యక్తం చేశారు. “మ్యాన్‌హోల్ మూతలను దొంగిలించినా, అమ్మినా లేదా కొనుగోలు చేసినా వారికి 1 నుండి 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది, మరియు దానివల్ల ఎవరైనా మరణిస్తే, శిక్ష 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 50 లక్షల (పాకిస్థానీ రూపాయలు) వరకు జరిమానా విధించబడుతుంది,” అని ఆమె హెచ్చరించారు.
ఇటీవల లాహోర్‌లోని దాతా దర్బార్ ప్రాంతంలో మూత లేని మ్యాన్‌హోల్‌లో పడి తల్లి, కుమార్తె మరణించారు. దీని తర్వాత పలు ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలే జరిగాయి. మ్యాన్ హోల్ మూతలు సుమారుగా 30 కిలోల ఐరన్ కలిగి ఉన్నాయి. వీటిని దొంగిలించి అమ్మితే డబ్బులు వస్తుండటంతో , పాక్ వ్యాప్తంగా వీటి దొంగతనాలు నిత్యకృత్యంగా మారాయి. మరోవైపు, పాకిస్తాన్ లో 45 శాతం పేదరికం ఉంది. ఇందులో 16.5 శాతం మంది తీవ్రమైన పేదరికంతో బాధపడుతున్నారు. దీంతో తమ ఇళ్లు గడవడానికి మ్యాన్ హోల్ మూతల్ని కూడా వదలడం లేదు.
"जो गटर का ढक्कन चोरी करेगा, जो गटर का ढक्कन बेचेगा, जो गटर का ढक्कन ख़रीदेगा उसे एक से दस साल तक की सजा होगी।"
– नवाज शरीफ की बेटी पंजाब की मुख्यमंत्री मरियम नवाज ने बकायदा वीडियो जारी कर यह घोषणा की है।
पाकिस्तान मैं लोग गटर के ढक्कन इतने चोरी करने लगे हैं कि यह क़दम उठाना… pic.twitter.com/F5IhkjUPid
— Mukesh Mathur (@mukesh1275) February 6, 2026
తాజావార్తలు
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్‌బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
-
Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్‌పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!