Pakistan-Bangladesh: పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. షేక్ హసీనా పదవికి రాజీనామా చేసిన తర్వాత, తాత్కాలిక ప్రభుత్వాధినేతగా వచ్చిన మహ్మద్ యూనస్ పాకిస్తాన్ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నారు. రెండు దేశాలు భారత్ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయి. తాజాగా, బంగ్లా-పాక్‌లు కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దౌత్య, అధికారిక పాస్‌పోర్టులు కలిగిన వ్యక్తుల వీసా రహిత ప్రవేశానికి అంగీకరించాయి.
Read Also: Thailand-Cambodia: తీవ్రమవుతున్న థాయిలాండ్-కంబోడియా ఘర్షణ.. 16 మంది మృతి..
1971 యుద్ధం తర్వాత, పాకిస్తాన్-బంగ్లాదేశ్‌లు తమ దౌత్య, వాణిజ్య, వ్యాపార సంబంధాలనున పునరుద్ధరించుకుంటున్నాయి. ఈ చర్యల్ని భారత్ నిశితంగా గమనిస్తోంది. బుధవారం ఢాకాలో అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ, బంగ్లాదేశ్ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జహంగీర్ ఆలం చౌదరి మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత వీసా ఫ్రీ ఎంట్రీపై నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్తాన్ రేడియో ప్రకటించింది. అంతర్గత భద్రత, పోలీస్ శిక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని రెండు దేశాలు అంగీకరించాయి. డ్రగ్స్, మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా సహకరించుకోవాలని అనుకుంటున్నాయి.
ఈ రెండు దేశాల సంబంధాలు భారత్‌ని ఒక హెచ్చరిక. ఈ రెండు దేశాల సంబంధాల తర్వాత పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చెందిన పలువురు ఏజెంట్లు అధికారులు రూపంలో బంగ్లాదేశ్‌కి వస్తున్నట్లు సమచారం. బంగ్లాదేశ్‌లో ఐఎస్ఐ ఏజెంట్ల ఉనికి, ఆ దేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది భారత్‌కు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. గత నెలల్లో పాక్ ఆర్మీ అధికారులు, ఐఎస్ఐ ఏజెంట్లు భారత సరిహద్దుల్లోని రంగ్‌పూర్, చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్ ఏరియాల్లో సంచరించినట్లు నివేదికలు వచ్చాయి.
