Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
- అణు సామర్థ్యం కోసం దేశాన్ని తాకట్టు పెట్టడానికి అసిమ్ మునీర్ కుట్ర..
- పాక్ లోని గ్వాదర్ పోర్టును శాశ్వతంగా చైనాకు ఇచ్చే ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: అణు సాంకేతికత కోసం దేశాన్ని తాకట్టు పెట్టడానికి కూడా పాకిస్తాన్ సిద్ధమైంది. కీలక అణు సామర్థ్యం కోసం చైనాకు తన గ్వాదర్ పోర్టును శాశ్వతంగా ఇవ్వడానికి పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ సిద్ధమైనట్లు ‘డ్రాప్ సైట్ న్యూస్’ ఒక కథనంలో వెల్లడించడం సంలచంగా మారింది. 2024లో పాక్-చైనా ద్వైపాక్షిక చర్చల్లో మునీర్ ఈ ప్రతిపాదన చేసినట్లు సమాచారం.
సముద్ర ఆధారిత సెకండ్-స్ట్రైక్ సామర్థ్యం కోసం పాకిస్తాన్ చైనాను కోరుతోంది. దీనికి ప్రతిఫలంగా గ్వాదర్‌లో చైనా శాశ్వత సైనిక స్థావరానికి అనుమతి ఇస్తామని పాక్, చైనాకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. పాక్ ఆకాశం, భూమి అణు దాడి సామర్థ్యాలతో పాటు సముద్రం నుంచి కూడా అణు దాడి నిర్వహించే సామర్థ్యంతో ‘‘న్యూక్లియర్ ట్రయాడ్’’గా మారాలని భావిస్తోంది. దీని కోసమే సముద్రం నుంచి అణు దాడి సామర్థ్యాన్ని చైనా నుంచి పొందాలని అనుకుంటోంది. అయితే, పాక్ డిమాండ్ అసాధారణమైందిగా భావించిన చైనా, ఈ చర్చల్ని మధ్యలోనే నిలిపేసినట్లు నివేదిక వెల్లడించింది.
Also Read
- Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్‌పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్‌కు స్పష్టమైన సందేశం..
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
- Hamas: హమాస్‌కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
2022లో పాక్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అసిమ్ మునీర్ చైనాకు దూరంగా అమెరికాకు దగ్గరవ్వడానికి ప్రయత్నించారని కథనం పేర్కొంది. ట్రంప్ పలుమార్లు తన ఫేమరెట్ ఫీల్డ్ మార్షల్ అని అసిమ్ మునీర్‌పై పలుమార్లు ప్రశంసలు కురిపించారు. పాక్ ప్రతిపాదన భారత్‌కు ప్రమాదం తెచ్చిపెట్టేలా ఉంది. ప్రస్తుతం రష్యా, చైనా, బ్రిటన్, భారత్ వంటి దేశాలకు మాత్రమే పూర్తి స్థాయిలో సముద్ర ఆధారిత అణు నిరోధక, దాడి సామర్థ్యాలు ఉన్నాయి. పాకిస్తాన్‌కు ఈ సామర్థ్యం లభిస్తే దక్షిణాసియాలో వ్యూహాత్మక సమీకరణాలు మారే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌కు అణు కార్యక్రమాల్లో చైనా సాంకేతిక సాయం అందించినట్లు నివేదిక వెల్లడించింది. అణు బాంబు నమూనాలు, యురేనియం, బాలిస్టిక్ క్షిపణి సాంకేతికత వంటి అంశాల్లో పాకిస్తాన్‌కు సహకారం అందించినట్లు చెప్పింది.
తాజావార్తలు
-
CJP Protest: యూటర్న్ తీసుకున్న సీజేపీ ఉద్యమం.. క్షణాల్లో సీన్ మార్పు
-
2027 World Cup Squad: 2027 వరల్డ్ కప్ టీమిండియాలో సీనియర్లకు నో.. ఆ క్రికెటర్ ఎంచుకున్న 15 మంది ప్లేయర్లు వీరే..
-
CJP: బర్గర్ వివాదం.. సీజేపీ అధికార ప్రతినిధి తొలగింపు..
-
Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్‌కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
-
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!