NTV Telugu Site icon

Pakistan: పాకిస్తాన్ ఆర్మీలో ఇంధన సంక్షోభం.. అన్నీ మూసుకు కూర్చుంది..

Pakistan

Pakistan

Pakistan: భారతదేశానికి ధీటుగా మా ఆర్మీ ఉంది, ఎప్పుడైనా కాశ్మీర్ ను రక్షించుకుంటాం అంటూ ప్రగల్భాలు పలికే పాకిస్తాన్ ఇప్పుడు ఆ దేశ సైన్యానికి తిండి పెట్టే పరిస్థితుల్లో కూడా లేదు. చివరకు పాకిస్తాన్ ఆర్మీ తీవ్ర ఇంధన సంక్షోభాన్ని చవిచూస్తోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ కూడా తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. FOL(ఫ్యూయర్, ఆయిల్, లూబ్రికెంట్ల) కొరత పాక్ ఆర్మీని తీవ్రంగా వేధిస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

దీంతో పాక్ ఆర్మీ రెగ్యులర్ గా జరిగే ‘యుద్ధ అభ్యసాలను’ నిలిపివేసింది. ఇప్పటికే పాక్ సైన్యం అన్ని ఫీల్డ్ ఫార్మెషన్లకు, ప్రధాన కార్యాలయాలకు లేఖలు రాసింది. డిసెంబర్ నెల వరకు అన్ని వార్ గేమ్స్ ని నిలపివేయాలని ఆదేశించింది. దీనికి కారణం ఇంధనం, లూబ్రికెంట్ల కొరతే. సాధారణంగా యుద్ధ అభ్యాసాల సమయంలో శతఘ్నులు, యుద్ధ విమానాలు, ఇతర ఆర్మీ వాహనాలను, పరికరాలను వాడాల్సి ఉంటుంది. సాధారణంగా యుద్ధ అభ్యాసాలకు వాడే టీ-80 యుద్ధ ట్యాంక్ కిలోమీటర్ కి 2 లీటర్ల ఇంధనం అవసరం. అయితే వీటికి చాలా మొత్తంలో ఇంధనం, లూబ్రికెంట్లు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న పరిస్థితుల్లో తినడానికి తిండే దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్మీ కూడా చేతులెత్తేసింది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు అన్ని యుద్ధ అభ్యాసాలను ఆపేసింది.

Read Also: Tamilnadu: తమిళనాడులో మరో పథకం.. గృహిణులకు ప్రతినెలా రూ.1000

ఇప్పటికే పాక్ ఆర్మీలోని జవాన్లకు రేషన్ పై ఫుడ్ పెడుతోంది అక్కడి ప్రభుత్వం. గోధుమల కొరతతో మంచి ఆహారం పాక్ సైనికులకు కరువైంది. చివరకు తినడానికి క్యాంటీన్లకు వెళ్లాలన్నా కూడా ఇంధనం ఆదా చేయడానికి వాహనాల్లో వెళ్లడం లేదు. నడుచుకుంటూ క్యాంటీన్లకు వెళ్తున్నారు. భారత్-పాక్ సరిహద్దు ఎల్ఓసీ వద్ద సైనికులు కూడా ఇందుకు మినహాయించు కాదు. వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆర్థికంగా దివాళా తీసేందుకు సిద్ధంగా ఉన్న పాకిస్తాన్ దేశానికి ఎక్కడా అప్పు పుట్టడం లేదు. చివరకు ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ కోసం కసరత్తు చేస్తుంది. పాక్ అప్పులు రుణం 77.5 బిలియన్ల డాలర్లు ఉంది. ఇక ప్రస్తుతం పాక్ ఖజానాలో కేవలం 4-5 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. అప్పులు దేశ జీడీపీలో 22 శాతం ఉన్నాయి. ఆ దేశంలో లీటర్ పెట్రోల్ రూ.253, కిరోసిన్ రూ. 164కి చేరుకుంది. గోధుమలు, కూరగాయాలు ప్రజలకు అందుబాటులో లేవు. ఇక ఆసియాలో అత్యధిక ద్రవ్యోల్భణం 38 శాతంగా ఉంది. ద్రవ్యోల్భణంలో శ్రీలంకను పాకిస్తాన్ అధిగమించింది.

Show comments