Asim Munir: పాక్ ఆర్మీ చీఫ్ సరికొత్త కుట్ర! ఆ పీఠంపైనే కన్నేశారా?
- పాక్ ఆర్మీ చీఫ్ సరికొత్త కుట్ర!
- ఆ పీఠంపైనే కన్నేశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. పహల్గామ్ ఉగ్ర దాడికి ఆద్యుడు. కాశ్మీర్‌పై రెచ్చగొట్టే ప్రసంగం చేసిన తర్వాతే ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది. ఇక తాజాగా సరికొత్త కుట్రలకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య విదేశీ పర్యటనలు ఎక్కువగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసిమ్ మునీర్ అగ్ర పీఠంపై కన్నేసినట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఆయన ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: అంతర్జాతీయ మీడియా కథనాలపై రామ్మోహన్ నాయుడు ఏం తేల్చారంటే..!
Also Read
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
అసిమ్ మునీర్.. ఆ మధ్య విదేశాల్లో స్థిరపడిన పాక్ జాతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కాశ్మీర్‌పై రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. కాశ్మీర్ మన గుండెకాయలాంటిది.. మన ఊపిరి అంటూ ఉద్వేగ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగం తర్వాతే ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు 26 మందిని మతం పేరుతో చంపేశారు.
ఇది కూడా చదవండి: Sonam Raghuvanshi: జైల్లో నెలరోజులు పూర్తి చేసుకున్న సోనమ్.. వెలుగులోకి ఆసక్తికర విషయాలు!
తాజాగా అసిమ్ మునీర్ పాకిస్థాన్ అధ్యక్ష పీఠంపై కన్నేసినట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. గత వారం ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్-అసిమ్ మునీర్ మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీ తర్వాతే పాకిస్థాన్‌లో రాజకీయ మార్పులపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇలా సమావేశాలు జరగడం ఇది రెండోసారి. వరుస భేటీలతో పాకిస్థాన్ రాజకీయాల్లో కీలక మార్పులు జరగబోతున్నాయని ప్రచారం విస్తృతంగా సాగుతోంది.
ప్రస్తుతం పాకిస్థాన్ అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీ ఉన్నారు. అయితే ఆ స్థానాన్ని అసిమ్ మునీర్‌తో భర్తీ చేయాలని భారీగా పుకార్లు జరుగుతున్నాయి. దౌత్యపరంగా పెరుగుతున్న ఒత్తిడి కారణంగా ఈ మార్పులు జరగబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం తిరుగుబాటు కూడా జరగొచ్చని వదంతులు నడుస్తున్నాయి.
ఈ మధ్య అసిమ్ మునీర్ ఎక్కువగా విదేశీ పర్యటనలు చేస్తున్నారు. పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ గల్ఫ్, ఆసియా దేశాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఆసిమ్ మునీర్ కూడా వెంట వెళ్లారు. ఈ నేపథ్యంలోనే అసిమ్ మునీర్ పాకిస్థాన్ అధ్యక్షుడు కావడం ఖాయమంటూ వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. ఇక తాజాగా పాకిస్థాన్ ప్రధాని లేకుండానే శ్రీలంక, ఇండోనేషియా పర్యటనలకు కూడా మునీర్ వెళ్తున్నారు. ఈ పర్యటనల నేపథ్యంలో పాకిస్థాన్‌లో ఏదో జరగబోతుందని ప్రచారం సాగుతోంది.
ఇక గత నెలలో అసిమ్ మునీర్ అగ్ర రాజ్యం అమెరికాలో పర్యటించారు. వైట్‌హౌస్‌లో మునీర్‌కు ట్రంప్ ప్రత్యేక విందు కూడా ఇచ్చారు. పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ కాకుండా మునీర్‌కు ప్రత్యేక ఆహ్వానం పంపడంపై అప్పుడే పెద్ద చర్చ జరిగింది. పాకిస్థాన్‌లో ఏదో జరగబోతుందని చర్చలు నడిచాయి. దౌత్యపరమైన ఒత్తిడి కారణంగానే పాకిస్థాన్‌లో తిరుగుబాటు తప్పదని భావిస్తున్నారు. 1958, అక్టోబర్‌లో సైనిక తిరుగుబాటు కారణంగా అప్పటి అధ్యక్షుడు ఇస్కందర్ మీర్జాను పదవీచ్చుతుని చేసి.. ఆయుబ్ ఖాన్ దేశాధ్యక్షుడయ్యాడు. ఇప్పుడు అసిమ్ మునీర్ కూడా అదే మాదిరిగా చేయాలని చూస్తు్న్నారు. అదే గనుక జరిగితే పాక్ చరిత్రలో ఇది రెండో సంఘటనగా మిగులుతుంది.
ఇక జైల్లో తనకేమైనా జరిగితే మునీర్‌దే బాధ్యత అంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ అడియాలో జైల్లో ఉన్నారు. అంటే మునీర్ పాకిస్థాన్ అధ్యక్షుడైతే తనకేదైనా జరుగుతుందని ఇమ్రాన్ ఖాన్ భావిస్తున్నారు. అసలేం ఏం జరుగుతుందో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
తాజావార్తలు
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
ట్రెండింగ్
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!