Site icon NTV Telugu

Pak Minister Asif: భారత్ ఎప్పుడైనా మాపై దాడి చేయవచ్చు.. పాక్ సంచలన వ్యాఖ్యలు..

Asif

Asif

Pak Minister Asif: హల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపత్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ సంచలన కామెంట్స్ చేశారు. భారత్ ఏ క్షణమైనా మాపై దాడి చేయవచ్చునని అన్నారు. ఈ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని సరిహద్దుల్లో పాక్ బలగాలను భారీగా మోహరించాం.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాం.. మరికొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. అయితే, మన ఉనికికి ప్రత్యక్ష ముప్పు ఏర్పడితే అణ్వాయుధాలను ప్రయోగించడానికి రెడీగా ఉన్నామని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్ తెలిపారు. కాగా, పాకిస్తాన్ రక్షణ మంత్రి చేసిన ఈ ప్రకటనతో పాక్‌లో కలకలం రేపుతుంది.

Read Also: Heart Health: ఈ ఆహార పదార్థాలు తింటే గుండె పోటుకు చెక్..!

ఇక, పహల్గామ్ లో టూరిస్టులపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 26 మంది మరణించారు. దీంతో రంగంలోకి దిగిన భారత ఆర్మీ.. టెర్రరిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో పాకిస్తాన్ హస్తం ఉందని తేలడంతో దాయాది దేశంతో దౌత్య సంబంధాలతో పాటు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. అలాగే, దేశం నుంచి పాకిస్తాన్ జాతీయులు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. రెచ్చగొట్టే కంటెంట్ ఉందనే కారణంతో పాకిస్తాన్ కు చెందిన యూట్యూబ్ ఛానెల్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది.

Exit mobile version