NTV Telugu Site icon

Pakistan: పాకిస్తాన్‌లో తీవ్ర నిరుద్యోగం.. స్టేడియంలో కానిస్టేబుల్ పరీక్ష..

Pakistan

Pakistan

Pakistan unemployment: దాయాది దేశం పాకిస్తాన్ లో తీవ్ర నిరుద్యోగం నెలకొంది. ఎంతలా అంటే సాధారణంగా ఏదైనా పోటీ పరీక్షను క్లాస్ రూముల్లో నిర్వహిస్తారు. కానీ పాకిస్తాన్ లో మాత్రం కానిస్టేబుల్ రాత పరీక్షను ఏకంగా ఓ స్టేడియంలో నిర్వహించాల్సి వచ్చింది. అంటే అంతలా అక్కడ నిరుద్యోగం పెరిగిపోయింది. ఇస్లామాబాద్ పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 1,667 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి శనివారం ఇస్లామాబాద్ లో రాత పరీక్ష జరిగింది. దీంతో రిక్రూట్మెంట్ పరీక్షను ఇస్లామాబాద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహించారు. స్టేడియంలో కూర్చోని ఆశావహులు పరీక్ష రాశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

Read Also: Jogi Ramesh: మరణాలకు కారణమైనవారిపై చర్యలు.. చంద్రబాబును అరెస్టు చేస్తాం..!

గత ఐదేళ్లుగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు పోటెత్తారు. దాదాపుగా 32,000 మంది మహిళలు, పురుషులు రాత పరీక్ష కోెసం ఇస్లామాబాద్ చేరుకున్నారు. 2022లో పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ ప్రకారం దేశంలో 31 శాతం యువత నిరుద్యోగులుగా ఉన్నారు. వీరిలో 51 శాతం మహిళలు కాగా.. 16 శాతం మంది పురుషులు ఉన్నారు. వీరిలో చాలా మందికి డిగ్రీలు ఉన్నాయి. ప్రస్తుతం పాక్ జనాభాలో 30 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారు 60 శాత మంది ఉన్నారు. దేశంలో నిరుద్యోగిత రేటు 6.9 శాతం ఉంది.

పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. అక్కడి ప్రజలకు నిత్యావసరాలు, గ్యాస్ సప్లై చేయలేని పరిస్థితి ఉంది. పాకిస్తాన్ ఐఎఎఫ్ షరతులను ఒప్పుకోకుంటే దివాళా తీయడం ఖాయమని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరిస్తున్నాడు. ఇప్పటికే అమెరికాలో ఉన్న రాయబార కార్యాలయం స్థలాన్ని వేలానికి పెట్టింది పాకిస్తాన్ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తోంది. పాక్ ఆర్థిక పరిస్థితికి అప్పులు, సీపెక్ ప్రాజెక్టు, భారీ వరదలు కారణం అయ్యాయి.

Show comments