Operation Hormuz: హార్ముజ్ జలసంధిలో భారీ ఆపరేషన్ చేపట్టిన అమెరికా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Hormuz: యూఎస్-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. హార్ముజ్ జలసంధిలో అమెరికా కీలక ఆపరేషన్ ప్రారంభించింది. జలసంధిలో చిక్కుకుపోయిన విదేశీ నౌకల్ని సురక్షితంగా రక్షణ కల్పించే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ “ప్రాజెక్ట్ ఫ్రీడమ్” అనే కార్యక్రమాన్ని ప్రకటించారు. ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కొనసాగుతున్న సంఘర్షణలో ప్రత్యక్షంగా పాల్గొనని అనేక దేశాలు, ఈ కీలకమైన షిప్పింగ్ కారిడార్‌లో చిక్కుకుపోయిన తమ నౌకలను విడిపించడానికి అమెరికా సహాయాన్ని కోరాయని తెలిపారు. ఆయన ఆ నౌకలను, వాటి సిబ్బందిని ఒక అస్థిరమైన పరిస్థితిలో చిక్కుకున్న “తటస్థ, అమాయక సాక్షులు”గా అభివర్ణించారు.
Also Read
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
- UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
- BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
ఈ నౌకలు స్వేచ్చగా, సమర్థవంతంగా తమ కార్యకలాపాలను కొనసాగించడానికి అమెరికా వాటిని నిషేధిత జలాల నుంచి బయటకు పంపిస్తుందని ట్రంప్ అన్నారు. ఈ ఆపరేషన్ సోమవారం ఉదయం ప్రారంభం కానుంది. ఇది ఒక మానవత ప్రయత్నమని ట్రంప్ చెప్పారు. ఓడల్లో ఉన్న సిబ్బందికి సురక్షితమైన జీవన పరిస్థితులు కల్పించడానికి అవసరమైన ఆహారం, నిత్యావసర వస్తువుల కొరత నెలకొన్నట్లు చెప్పారు. ఈ ప్రయత్నం ఇరాన్, ఈ ప్రాంతంలోని ఇతర దేశాలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.
ఇదే సమయంలో ఇరాన్‌తో సానుకూల చర్చలు జరుగుతున్నాయని, దౌత్య పురోగతికి ఆస్కారం ఉందని ట్రంప్ చెప్పారు. ఈ ఆపరేషన్‌లో ఎవరైనా జోక్యం చేసుకుంటే బలప్రయోగంతో ప్రతిస్పందిస్తామని ఇరాన్‌ను హెచ్చరించారు. హార్ముజ్ జలసంధి ఇరాన్ యుద్ధంలో కీలకంగా మారింది. ఇరుకైన ఈ జల మార్గం ద్వారా 20 శాతం చమురు, గ్యాస్ రవాణా జరుగుతుంది.
తాజావార్తలు
-
West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?