NTV Telugu Site icon

Israel- Iran: ఇజ్రాయెల్పై అణు దాడి చేయాలని ఇరాన్ ప్రజలు డిమాండ్..

Iran

Iran

Israel- Iran: హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణంతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఆగ్రహంతో ఉంది. బెంజమిన్ నెతన్యాహు సర్కార్ పై ప్రతీకార చర్యలు తీసుకోవాలని ఛాందసవాదులు డిమాండ్‌ చేస్తున్నారు. చివరకు అణుబాంబులు ఉపయోగించాలనే స్థాయిలో వారు మాట్లాడుతున్నారు. అలాగే, కీలక హోర్ముజ్‌ జలసంధిని దిగ్బంధించాలని సూచనలు జారీ చేస్తున్నారు. పరమ ఛాందసవాది సయీద్‌ జలీలీ ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాది మసూద్‌ పెజెష్కియాన్‌ చేతిలో ఓడిపోయారు.

Read Also: Maharashtra: దేశవాళీ ఆవులను రాజ్యమాత- గోమాతగా ప్రకటించిన మహారాష్ట్ర సర్కార్..

ఇజ్రాయెల్‌ దాడుల వేళ.. కొత్త అధ్యక్షుడిపై ఈ ఛాందసవాదులు విమర్శలు చేస్తున్నారు. గాజా, లెబనాన్‌లో జరుగుతోన్న ఆపరేషన్లపై మసూద్ స్పందించడం లేదని విమర్శలు వస్తున్నాయి. చమురు రవాణాలో కీలకమైన బాబ్‌ అల్‌ మండబ్‌ జలసంధిని యెమెన్ తన కంట్రోల్‌లోకి తీసుకుంది.. అలాగే, పాశ్చాత్య నౌకల రాకపోకలు కొనసాగిస్తున్న హోర్ముజ్‌ జలసంధిని ఇరాన్ ఎందుకు దిగ్బంధించడం లేదని క్వశ్చన్ చేస్తున్నారు.

Read Also: Bunker buster: బంకర్ బస్టర్ అంటే ఏమిటి? నస్రల్లాను ఎలా చంపగలిగింది?

ఇక, ఇజ్రాయెల్ పై అణు దాడి చేయాలనే డిమాండ్లడు వస్తున్నాయి. ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ సొహ్రబ్‌ సాలేహి ఎక్స్(ట్విట్టర్) వేదికగా.. ఇరాన్ ఇప్పటికే అన్ని అవకాశాలను ఉపయోగించింది.. ఇక మిగిలింది అణు కార్డే.. ఇదే పాశ్చాత్య దేశాలను చర్చలకు కూర్చోబెడుతుందని పేర్కొన్నాడు. అయితే, ఈ డిమాండ్లను వ్యతిరేకిస్తున్న వారు కూడా ఇరాన్ లో ఉన్నారు. హోర్ముజ్‌ను నియంత్రణలోకి తీసుకోవడం వల్ల ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయ్.. అది ఇరాన్‌ను ఆర్థికంగా, దౌత్యపరంగా దెబ్బ తీస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. హసన్ నస్రల్లా మరణం తర్వాత మారుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని .. దేశ ప్రయోజనాలను కాపాడుకోవడంపైనే ఇరాన్‌ మరింత దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.