Site icon NTV Telugu

Iran-Israel War: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ప్రపంచ వ్యాప్తంగా భారీగా పెరిగిన చమురు ధరలు

Petrol

Petrol

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకరదాడులకు పాల్పడింది. 100 లక్ష్యాలను 200 యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ దాడి చేసింది. అణు స్థావరాలే లక్ష్యంగా దాడి చేయడంతో ఇరాన్ భారీ నష్టాన్ని చవిచూసింది. ఇరాన్‌లో అత్యంత శక్తివంతమైన నాయకులతో పాటు అణు శాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇరాన్ కూడా ప్రతీకార దాడులు మొదలు పెట్టింది. 100 డ్రోన్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. వాటిని గాల్లోనే ఐడీఎఫ్ తిప్పికొట్టింది.

ఇది కూడా చదవండి: Plane Crash: భర్త పుట్టిన రోజు సెలబ్రేషన్స్ కోసం లండన్ వెళుతూ.. అనంతలోకాలకు..

ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు 10 శాతానికి పైగా పెరిగాయి. హర్మోజ్‌ జలసంధి ద్వారా జరిగే గ్లోబల్‌ ఆయిల్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగవచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆసియా, యూరప్ అంతటా షేర్లు పడిపోయాయి. ఇక రాబోయే రోజుల్లో ఈ యుద్ధం మరింత ఉధృతంగా సాగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే గనుక జరిగితే చమురు ధరలు అమాంతంగా పెరిగే సూచనలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: END vs ENG: రవీంద్ర జడేజా ఓ జట్టులో.. కుల్దీప్ యాదవ్‌ మరో జట్టులో!

ఒమన్‌-ఇరాన్‌ సముద్ర మార్గంలో హర్మోజ్‌ జలసంధి ఉంటుంది. ఈ జలసంధి ప్రపంచంలోని అతి ముఖ్యమైన షిప్పింగ్ మార్గాల్లో ఒకటి. ప్రపంచంలోని చమురులో ఐదవ వంతు దీని గుండా వెళుతుంది. ఉత్తరాన ఇరాన్.. దక్షిణాన ఒమన్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లతో సరిహద్దులుగా ఉన్న హర్మోజ్‌ జలసంధి అరేబియా సముద్రంతో కలుపుతుంది. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌, ఖతార్‌, ఇరాక్‌, ఇరాన్‌ దేశాల నుంచి వివిధ దేశాలకు రోజుకు 2.1 కోట్ల (21 మిలియన్‌) బ్యారెళ్ల చమురు ఎగుమతి అవుతుంది. ప్రస్తుతం ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో వీటిపై కూడా దాడి జరగొచ్చని భావిస్తున్నారు. అదే గనుక జరిగేతే ధరలు ఆకాశన్నంటే అవకాశాలు ఉన్నాయి.

ఇరాన్‌లో అత్యున్నత సైనికాధికారి మొహమ్మద్ బాఘేరి దుర్మరణం చెందారు. ఈ మేరకు ఇరాన్ మీడియా ధృవీకరించింది. అలాగే ఇరాన్‌లో అత్యంత శక్తివంతమైన రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుస్సేన్ సలామి కూడా మరణించారు. ఐఆర్‌జీసీ హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో మేజర్‌ జనరల్‌ హుస్సేన్ సలామితో పాటు రెవల్యూషనరీ గార్డ్‌లోని ఇతర ముఖ్య అధికారులు, ఇద్దరు అణు శాస్త్రవేత్తలు కూడా మరణించారు. ఈ మేరకు ఇరాన్ మీడియా తెలిపింది.

Exit mobile version