Site icon NTV Telugu

Obama-Michelle: మిచెల్‌తో విడాకులపై ఒబామా కీలక వ్యాఖ్యలు

Obamamichelle

Obamamichelle

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా-మిచెల్ దంపతులు విడిపోతున్నట్లు ఆ మధ్య కాలంలో జోరుగా ప్రచారం సాగింది. విడాకులు కూడా తీసుకోబోతున్నట్లు వదంతులు నడిచాయి. మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు మిచెల్ హాజరుకాలేదు.. అనంతరం జనవరి 20న జరిగిన ట్రంప్ ప్రమాణస్వీకారానికి కూడా మిచెల్ హాజరుకాకపోవడంతో ఆ పుకార్లకు మరింత బలం చేకూర్చింది. ఇంత ప్రచారం జరిగినా వాళ్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

తాజాగా ఇదే అంశంపై ఒక ఇంటర్వ్యూలో ఒబామా నోరు విప్పారు. హామిల్టన్ కళాశాల అధ్యక్షుడు స్టీవెన్ టెప్పర్‌తో జరిగిన సంభాషణలో ఒబామా మాట్లాడుతూ.. భార్య మిచెల్‌తో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలిపారు. దీని నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. చాలా రోజుల నుంచి వైవాహిక బంధం ఒడిదుడుకులకు గురవుతున్నట్లు ఒబామా ఒప్పుకున్నారు.

ఇది కూడా చదవండి: Aishwarya Rajesh : బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా తెలుగులో సినిమాలు లేవు

అమెరికా అధ్యక్షుడిగా ఒబామా రెండు పర్యాయాలు పని చేశారు. అప్పటి నుంచి కూడా ఒబామా-మిచెల్ మధ్య మంచి సంబంధాలు లేనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పరిస్థితులు మరింత తీవ్రమైనట్లు సమాచారం. 2022లో మిచెల్ కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నా భర్తను పదేళ్లు భరించలేకపోయాను’’ అని తెలిపారు. అయితే మొదటి నుంచి కూడా దంపతుల మధ్య మనస్పర్థలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒబామా ఎక్కువ సార్లు.. వైట్‌హౌస్‌లో కంటే.. బయట గడపడానికి ఇష్టపడేవారని సన్నిహితులు చెబుతుంటారు. ఎనిమిదేళ్ల పాటు వైట్‌హౌస్‌లో చాలా ఇబ్బందులు పడినట్లుగా అంటుంటారు. ఒబామా దంపతులు 1980లో చికాగోలోని ఒక న్యాయ సంస్థలో కలుసుకున్నారు. 1992లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం.

ఇది కూడా చదవండి: Aishwarya Rajesh : బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా తెలుగులో సినిమాలు లేవు

Exit mobile version