Site icon NTV Telugu

Pakistan: మేము బిచ్చగాళ్లమే.. ఒప్పుకున్న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్..

Pak Shahbaz Sharif

Pak Shahbaz Sharif

Pakistan: పాకిస్తాన్ ఓ వైపు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, ఆ దేశం సైన్యానికి మాత్రం బాగా ఖర్చు చేస్తోంది. ప్రజల గురించి ఆలోచించడం మానేసి, భారత వ్యతిరేకతతోనే బతుకుతోంది. దేశాన్ని ఆర్థిక గండం నుంచి బయటపడేసేందుకు ప్రధాని నేతృత్వంలోని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకుల ముందు సాగిలపడుతోంది. ఇదే కాకుండా, పాకిస్తాన్ మిత్రదేశాల పర్యటనలకు వెళ్లి ‘‘భిక్షం’’ అడుగుతోంది.

పాకిస్తాన్ ప్రధాని పర్యటనకు వస్తున్నారంటే దాని మిత్రదేశాలు భయపడుతున్నాయి. తమను ఎక్కడ అప్పులు అడుగుతారో అని సందేహపడుతున్నాయి. ఇప్పటికే, పాకిస్తాన్ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగింది. నిత్యావసరాలు అందుబాటు ధరల్లో లేవు. ఇక గోధుమ పిండి కోసం పెద్ద యుద్ధాలే చేయాల్సి వస్తోంది. రాజకీయ తిరుగుబాటు, సైన్యం ఒత్తిళ్లు, బలూచ్ తిరుగుబాటు, పాక్ తాలిబాన్ల దాడులతో ఆ దేశం అతలాకుతలం అవుతోంది.

Read Also: Sree Leela : ఎంగేజ్ మెంట్ ఫొటోలపై స్పందించిన శ్రీలీల..

ఇదిలా ఉంటే, తమ పరిస్థితి ఏంటనేది స్వయంగా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అందరి ముందు ఒప్పుకున్నాడు. ‘‘తాము భిక్షగాళ్లమే’’ అని పరోక్షంగా చెప్పాడు. శనివారం జరిగిన ఒక సైనిక కార్యక్రమంలో షరీఫ్ మాట్లాడుతూ.. ఇప్పుడు మన మిత్రదేశాలు కూడా పాకిస్తాన్ ‘‘భిక్షాటన గిన్నె’’తో రావాలని కోరుకోవడం లేదని అన్నారు. చైనా, సౌదీ అరేబియా, టర్కీ, ఖతార్, యూఏఈ తమ అత్యంత విశ్వసనీయ మిత్రదేశాలని చెప్పారు. ఇప్పుడు వారు వాణిజ్యం నుంచి విద్య వరకు అన్ని రంగాల్లో పాకిస్తాన్ భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నారని, మేము భిక్షాటన గిన్నెతో వారి వద్దకు వెళ్లాలని కోరుకోవడం లేదని షరీఫ్ చెప్పారు.

నేను, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇలా చేసే చివరి వ్యక్తులం అవుతామని ప్రధాని షరీఫ్ చెప్పారు. చైనా, అమెరికా, టర్కీ, ఖతార్‌తో పాటు IMF మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలు వివిధ సందర్భాలలో పాకిస్తాన్‌కు భారీ ఆర్థిక సహాయం అందించాయి. అయినా కూడా ఆ దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడలేదు.

Exit mobile version