Site icon NTV Telugu

North Korea: “అదే జరిగితే కిమ్ పాలన అంతం అవుతుంది”.. నార్త్ కొరియాకు అమెరికా వార్నింగ్..

Kim Jong Un

Kim Jong Un

North Korea: నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కి అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా లేదా దాని మిత్ర రాజ్యాలపై అణుదాడి జరిగితే అది ఆమోదయోగ్యం కాదని, ఈ పరిణామాలు కిమ్ పాలనకు ముగింపు పలుకుతాయని అమెరికా-దక్షిణ కొరియా ఒక సంయుక్త ప్రకటనలో శనివారం తెలిపాయి.

Read Also: Teacher illicit affair: మహిళా టీచర్‌తో కొడుకు శృంగారం.. మొబైల్ ట్రాకింగ్ యాప్‌తో రెడ్ హ్యాండెట్‌గా పట్టుకున్న తల్లి..

దక్షిణకొరియాకు వ్యతిరేఖంగా ఉత్తరకొరియా ఎలాంటి అణుదాడి చేసినా, తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటుందని అమెరికా హెచ్చరించింది. అమెరికా-రిపబ్లిక్ కొరియా న్యూక్లియర్ కన్సల్టెవ్ గ్రూప్(ఎన్‌సీజీ) రెండో సమావేశం శుక్రవారం వాషింగ్టన్‌లో జరిగింది. ఉత్తర కొరియా విభేదాల నేపథ్యంలో మరింత ప్రణాళిక బద్ధంగా అవగాహన పంచుకోవడానికి యూఎస్-దక్షిణ కొరియాలు చర్చించాయి.

Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసిన యూపీ కోర్టు..

ఇటీవల కాలంలో ఉత్తర కొరియా, దక్షిణ కొరియా-జపాన్-యూఎస్ ప్రధాన భాగాలను చేరుకునేలా బాలిస్టిక్ క్షిపణుల శ్రేణిని అభివృద్ధి చేసి పరీక్షిస్తోంది. కిమ్ ఈ నెలలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించవచ్చని దక్షిణ కొరియా డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు కిమ్ టే-హ్యో శుక్రవారం తెలిపారు, ఇది అణు వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదని చెప్పారు.

Exit mobile version