North Korea: K-పాప్, సినిమాలు షేర్ చేయడమే పాపం.. బహిరంగా మరణశిక్షలు విధిస్తున్న కిమ్..
- కిమ్ జోంగ్ ఉన్ పాలనలో అరాచకం..
- శత్రు దేశాలు పాటలు విన్నందుకు మరణశిక్షలు..
- దక్షిణ కొరియా రిపోర్టులో వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: కిమ్ జోంగ్ ఉన్ పాలనలో ఉన్న ఉత్తర కొరియా ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కిమ్, కిమ్ తాత, కిమ్ తండ్రి గురించి ప్రగల్భాలు పలకడంతోనే ఆ దేశం నడుస్తోంది. ప్రాపగండాలో అక్కడ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో అనే విషయం కూడా అక్కడి ప్రజలకు తెలియదంటే అతిశయోక్తి కాదు. ఇక అక్కడ విచిత్రమైన చట్టాలు, శిక్షలు ఏ దేశంలో కూడా ఉండదు. అమెరికా, దక్షిణ కొరియా అంటే ద్వేషించి నార్త్ కొరియా, అక్కడి ప్రజలు ఈ రెండు దేశాలకు సంబంధించిన విషయాలతో సంబంధం ఉందని తెలిస్తే అక్కడి అధికారులు దారుణంగా చంపేస్తారు.
పలు సందర్భాల్లో కే-పాప్ మ్యూజిక్ విన్నందుకు, కొరియన్ సినిమాలు చూసినందుకు నిర్ధాక్షిణ్యంగా అక్కడి ప్రజలను ఉరితీయడం, బహిరంగంగా కాల్చి చంపడం వంటి శిక్షల్ని విధిస్తుంటుంది. సియోల్-2020 చట్టం ప్రకారం దక్షిణ కొరియా టీవీ సిరీస్‌లు, సినిమాలు, కే-పాప్ మ్యూజిక్ షేర్ చేస్తూ పట్టుబడిన వ్యక్తులకు కిమ్ జోంగ్ ఉన్ పాలన బహిరంగంగా మరణశిక్ష విధించిందని దక్షిణకొరియా మంత్రిత్వ శాఖ జూన్ 27న తెలిపింది.
Also Read
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
Read Also: Delhi Rains : ఢిల్లీలో కుండపోత వర్షంపై ఐఎండీ అంచనా విఫలం.. ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు
దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ‘‘2024 ఉత్తర కొరియా మానవ హక్కుల నివేదిక ప్రకారం’’, ఇటీవల కాలంలో బహిరంగ మరణశిక్షలు పెరిగాయని చెప్పింది. దక్షిణ కొరియాతో పాటు వెస్ట్రన్ దేశాలు, శత్రుదేశాలకు సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉండటం, ఇతరులతో పంచుకోవడం వంటివి చేస్తే ఉత్తరకొరియాలో మరణశిక్షలు విధిస్తుంది. 2022లో సౌత్ హ్వాంగ్‌హే ప్రావిన్స్‌లోని ఒక గనిలో 22 ఏళ్ల వ్యవసాయ కార్మికుడిని బహిరంగంగా మరణశిక్ష విధించినట్లు నివేదిక పేర్కొంది. నిందితుడు దక్షిణ కొరియాకు చెందిన 70 పాటలను విన్నందుకు, 3 సినిమాలు చూసినందుకు వారిని అరెస్ట్ చేశారు. అతను మరో ఏడుగురికి వీటిని షేర్ చేశారని అభియోగాలు ఎదుర్కొన్నారు.
మొదటగా ఈ మెటీరియల్ తీసుకువచ్చిన వ్యక్తులకు కఠిన శిక్షల ఉంటాయి. ఫైరింగ్ స్వ్కాడ్ ద్వారా వీరిని బహిరంగంగా కాల్చి చంపుతారు. ఆ తర్వాత దీంట్లో ఉన్నవారి తప్పును బట్టి శిక్ష విధిస్తున్నారు. 2023 నాటికి ఉత్తర కొరియా విడిచి పారిపోయిన 649 మంది సాక్ష్యాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!