Site icon NTV Telugu

North Korea: ఉక్రెయిన్‌పై యుద్ధానికి రెడీ.. రష్యాకు మద్దతు ప్రకటించిన కిమ్

Northkorea

Northkorea

రష్యా-ఉక్రెయిన్ మధ్య గత నాలుగేళ్ల నుంచి యుద్ధం సాగుతోంది. ఇరు దేశాలు నువ్వానేనా? అన్నట్టుగా దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఆపరేషన్ స్పైడర్ వెబ్‌ పేరుతో ఉక్రెయిన్.. రష్యాను దారుణంగా దెబ్బకొట్టింది. రష్యాకు చెందిన యుద్ధ విమానాలను డ్రోన్ల ద్వారా ఉక్రెయిన్ పేల్చేసింది. దీంతో రష్యాకు ఊహించని ఎదురు దెబ్బ తగలింది.

ఇది కూడా చదవండి: Putin-Trump: భారత్-పాక్ ఉద్రిక్తతలపై ట్రంప్-పుతిన్ సంభాషణ.. ఏం చర్చించారంటే..!

ఇక ఉక్రెయిన్‌తో రష్యా జరిగించిన యుద్ధంలో ఉత్తరకొరియా సైన్యం సహకరించింది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. తన సైన్యాన్ని రష్యాకు పంపించారు. తాజాగా ఉక్రెయిన్ భీకరదాడులు చేసిన నేపథ్యంలో రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగుతో కిమ్ భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌పై చేసే యుద్ధానికి ఎలాంటి షరతులు లేకుండా భేషరతుగా రష్యాకు మద్దతిస్తు్న్నట్లు కిమ్ ప్రకటించారు. ఈ మేరకు ఉత్తరకొరియా మీడియా వెల్లడించింది. అలాగే ఇరువురి భేటీలో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం వంటి పలు అంశాలపై కూడా చర్చించుకున్నట్లు తెలుస్తోంది. కుర్స్క్‌ ప్రాంతం పునర్‌నిర్మించే అంశంపై కూడా మాట్లాడుకున్నట్లు మీడియా వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Warangal: ఎంతకు తెగించార్రా.. ఆంధ్రప్రదేశ్ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో ఘరానా మోసం..

ఉక్రెయిన్‌పై రష్యా 2022లో దండయాత్ర ప్రారంభించింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం సాగుతూనే ఉంది. అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. సౌదీ అరేబియా వేదికగా రష్యాతో అమెరికా చర్చలు జరిపింది. కానీ ఒక కొలిక్కి రాలేదు. తాజాగా ఇస్తాంబుల్ వేదికగా మరోసారి చర్చలు జరగాల్సి ఉండగా ఉక్రెయిన్ ఊహించని రీతిలో రష్యా వైమానిక స్థావరాలపై డ్రోన్ల దాడి చేసింది. దీంతో రష్యా బాంబర్లు నాశనం అయ్యాయి. దీనిపై ప్రతీకారం తీర్చుకునేందుకు రష్యా సిద్ధపడుతున్నట్లు సమాచారం.

Exit mobile version