North Korea: ఇది ఉత్తర కొరియా “వోల్వో కార్”ల కహానీ.. 50 ఏళ్లుగా స్వీడన్‌కి పైసా చెల్లించలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: ఉత్తర కొరియా ప్రపంచంలోనే ఓ నిగూఢ దేశం. నిజానికి ఆ దేశ ప్రజలకు బయట ఒక ప్రపంచం ఉందని తెలియదంటే అతిశయోక్తి కాదు. కేవలం నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చెప్పేదే న్యాయం, చేసేదే చట్టం అక్కడ. తన తాత, తండ్రులే అక్కడ దేవుళ్లు. ఇంతలా అక్కడి ప్రజలు అణిచివేతకు గురవుతున్నారు. శిక్షల్లో, వింత వింత రూల్స్‌కి నార్త్ కొరియా పెట్టింది పేరు.
ఇదిలా ఉత్తర కొరియాకు చెందిన ఓ కార్ల కహానీ ఇప్పుడు వైరల్ అవుతోంది. 49 ఏళ్ల క్రితం 1974 ఉత్తర కొరియా 1000 వోల్వో కార్లను ఆర్డర్ పెట్టి, స్వీడన్ నుంచి తమ దేశానికి తెప్పించింది. అప్పట్లో వీటి విలువ 73 మిలియన్ డాలర్లు. అయితే ఇప్పటి వరకు ఆ డబ్బును ఉత్తర కొరియా, స్వీడిష్ కంపెనీ వోల్వోకు చెల్లించలేదు. దాదాపుగా 5 దశాబ్ధాల నుంచి ఈ డబ్బులను చెల్లించలేదు. ఇప్పుడు వాటి విలువ 330 మిలియన్ డాలర్లకు చేరుకుంది.
Also Read
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
Read Also: Israel-Hamas War: శ్మశానాలు నిండిపోయాయి.. ఫుట్‌బాల్ మైదానంలో మృతుల ఖననం..
ఉత్తర కొరియా పాశ్చాత్య దేశాల నుంచి విదేశీ మూలధంన, సాంకేతికత కోసం పరికరాలను దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. భవిష్యత్తులో ఉత్పత్తి, మైనింగ్ ఉత్పత్తులతో రుణదాతలకు రుణాలు చెల్లిస్తామని వాగ్దానం చేసింది. అయితే నార్త్ కొరియా పాలకులు ఈ అప్పులను చెల్లించే ఉద్దేశం లేదని రుణదాతలకు తర్వాత అర్థమైంది. 2016లో స్వీడిష్ ఎంబసీ ఒక పోస్టులో దీని గురించి పేర్కరొంది. డీపీఆర్ కొరియా 1974 స్వీడన్ నుంచి దిగుమతి చేసుకున్న కార్లలో ఒక్కదానికి కూడా డబ్బులు చెల్లించలేదని ట్వీట్ చేసింది.
విషయం ఏంటంటే డబ్బులు చెల్లించకున్నా.. ఆ కార్లను ఉత్తర కొరియా ఇప్పటికీ ఉపయోగిస్తూనే ఉంది. ప్రత్యేక అవసరాల కోసం వీటని వినియోగిస్తోంది. ఎన్పీఆర్ రిపోర్ట్ ప్రకారం.. యూఎస్ జర్నలిస్ట్ అర్బన్ లెహ్నర్ 1989లో ఉత్తర కొరియాలో తన రెండు వారాల పర్యటన కోసం వోల్వో 144 సెడాన్ కార్లో ప్రయాణించారు. జర్నలిస్టులు ఈ కార్లలో ప్రయాణించే వారని, రోడ్లు చాలా ఖాళీగా ఉండేవని ఆయన గుర్తు చేసుకున్నారు.
తాజావార్తలు
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!