Pahalgam Terror Attack: పహల్గామ్‌పై న్యూయార్క్ టైమ్స్ తప్పుడు కథనం.. తీవ్రంగా తప్పుపట్టిన అమెరికా
- పహల్గామ్‌పై న్యూయార్క్ టైమ్స్ తప్పుడు కథనం
- తీవ్రంగా తప్పుపట్టిన అమెరికా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్రదాడిని పాకిస్థాన్ తప్ప ప్రపంచమంతా ముక్త కంఠంతో ఖండిస్తోంది. ప్రపంచ అగ్ర నేతలంతా ప్రధాని మోడీకి ఫోన్ చేసి సంఘీభావం తెలుపుతున్నారు. అత్యంత ఘోరంగా పహల్గామ్లో మారణహోమం జరిగి కళ్లకు ప్రత్యక్షంగా కనబడుతుంటే.. న్యూయార్క్ టైమ్స్‌కు మాత్రం కళ్లు కనిపించడం లేదు. పట్టపగలు.. అంత ఘోరంగా నరమేధం జరిగితే.. న్యూయార్క్ టైమ్స్ మాత్రం తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. అంతేకాకుండా ఒక బహిరంగ సభలో ఉగ్రవాదుల అంతు చూస్తామంటూ ప్రకటించారు. ఇంత స్పష్టంగా ఉగ్రదాడిని చెబుతుంటే.. న్యూయార్క్ టైమ్స్ మాత్రం మిలిటెంట్ దాడిగా కథనాన్ని ప్రచురించింది.
ఇది కూడా చదవండి: Asaduddin Owaisi: ఉగ్రదాడి నేపథ్యంలో ముస్లింలకు ఓవైసీ కీలక పిలుపు..
Also Read
- Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
- India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
అయితే ఈ కథనంపై అమెరికా హౌస్ ప్యానెల్ మెజార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. తప్పుడు కథనాన్ని ప్రచురించిందంటూ అమెరికా హౌస్ ప్యానెల్ఎక్స్ హ్యాండిల్లో ఈ మేరకు పోస్టు చేసింది. దాడి చేసిన వారిని ‘టెర్రరిస్టు’లుగా కాకుండా తప్పుదోవ పట్టించేలా ‘మిలిటెంట్లు’గా చిత్రీకరిస్తూ శీర్షిక ప్రచురించడంపై ధ్వజమెత్తింది. వార్తలో మిలిటెంట్లు, గన్మెన్లు(సాయుధులు) అని రాసుకొచ్చింది. అంతేకాకుండా ఒక సాధారణ కాల్పుల ఘటనగా పహల్గామ్ను ఉద్దేశించి రాసుకొచ్చింది. వార్త క్లిప్పింగ్‌ను ఎర్రటి అక్షరాలతో సరిచేసిన అమెరికా హౌస్ ప్యానెల్ కమిటీ ఎక్స్‌లో పోస్టు చేసింది. ‘‘హేయ్ న్యూయార్క్ టైమ్స్. నీ కోసం ఈ తప్పు మేము సరిచేశాము. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ‘ఉగ్రదాడి’. ఏది ఏమైనప్పటికీ భారత్ లేదా ఇజ్రాయెల్‌లో జరిగే ఉగ్రవాదం విషయంలో న్యూయార్క్ టైమ్స్ నిజాలను మాయం చేస్తుంది’’ అంటూ అమెరికా హౌస్ ప్యానెల్ కమిటీ ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఇది కూడా చదవండి: CM Yogi: ఉగ్రదాడి బాధితుల మాటలు విని కన్నీరుపెట్టుకున్న సీఎం యోగి.. (వీడియో)
ఇదిలా ఉంటే పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ దాడి చేసింది తామేనని ప్రకటించింది. ఈ సంస్థ నిషేధిత లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా ఉంది. దాడి చేసింది తామేనని చెప్పినప్పటికీ న్యూయార్క్ టైమ్స్‌కి మాత్రం మిలిటెంట్ దాడిలా కనిపించిందా? అంటూ అమెరికా హౌస్ ప్యానెల్ కమిటీ మండిపడింది.
మిలిటెంట్‌కు ఉగ్రవాదం మధ్య వ్యత్యాసం ఇదే
సాధారణంగా మిలిటెంట్స్ అనేది రాజకీయ లేదా సామాజిక ఫలితాన్ని ఆశించి రాష్ట్రం లోపల జరిగే సాయుధ తిరుగుబాటును మిలిటెంట్‌గా సూచిస్తోంది. కానీ ఉగ్రవాదం అలాంటిది కాదు. భారీ లక్ష్యంతో జరిగించేదాన్ని ఉగ్రవాదం అంటారు. ఇందులో హింస, రక్తపాతం ఉంటుంది. దీని కోసం అసమాన యుద్ధం జరుగుతుంది. ప్రస్తుతం పహల్గామ్ ఘటన కూడా అలాంటి ఉద్దేశంతో జరిగించిందే. కానీ న్యూయార్క్ టైమ్స్ మాత్రం ఒక మిలిటెంట్ దాడిగా అభివర్ణించింది. కథనం తీరుపై అమెరికా ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది.
Hey, @nytimes we fixed it for you. This was a TERRORIST ATTACK plain and simple.
Whether it’s India or Israel, when it comes to TERRORISM the NYT is removed from reality. pic.twitter.com/7PefEKMtdq
— House Foreign Affairs Committee Majority (@HouseForeignGOP) April 23, 2025
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?