ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.. ఆ సంస్థకు సీఈవోగా ఉన్న సుందర్ పిచాయ్ ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.. కరోనా మహమ్మారి కారణంగా పని విధానంలో, జాబ్ స్టైల్‌లో కీలక మార్పులు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి.. మరీ ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం, ఆన్‌లైన్ క్లాసులు.. ఒక్కటేంటి.. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండానే అన్నీ చక్కబెట్టుకునేదానిపై ఫోకస్ పెరిగిపోయింది.. అయితే, క్రమంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. ఉద్యోగుల పని విధానంపై కొన్ని సంస్థలు ఎటూ తేల్చలేక పోతున్నాయి.. థర్డ్ వేవ్ హెచ్చరికలు కూడా ఉండడంతో.. వర్క్ ఫ్రం హోం కొనసాగించాలా? ఉద్యోగులను ఆఫీసులకే రప్పించాలా? అనే విషయంలో సతమతం అవుతున్నాయి.. ఇదే తరుణంలో.. గూగుల్ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది.. ఉద్యోగుల ఫ్లెక్సిబుల్ వర్కింగ్ మెథడ్‌ను కనుగొంది.. మరి ఇది ఎలాంటి ఫలితాలు ఇస్తుందనే వేచి చూడాల్సి ఉంది.
గూగుల్ తీసుకున్న ఆ సంచలన నిర్ణయం విషయానికి వస్తే.. ఇప్పటి వరకు గూగుల్‌లో 5 వర్కింగ్ డేస్ అమల్లో ఉన్నాయి.. కానీ, వర్క్ ఫ్రం హోం, వర్క్ ఫ్రం ఆఫీసు విషయాల్లో కొంత క్లారిటీ మాత్రం లేదు.. అయితే, తమ ఉద్యోగుల కోసం గూగుల్ 2/3 మోడల్ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసింది.. ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్.. ఈ 2/2 మోడల్ ప్రకారం రెండు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేస్తే.. మూడు రోజులు ఇంటి నుంచే పని చేసే వెసులుబాటు బాటు ఉంటుంది.. ప్రస్తుతానికి ఈ మోడల్ యూఎస్‌లో అమలు చేస్తుండగా.. దాని ఫలితాలను బట్టి ప్రపంచ వ్యాప్తంగా తమ ఉద్యోగులను క్రమంగా ఈ మోడల్‌లోకి తీసుకొస్తాం అంటున్నారు సుందర్ పిచాయ్. మొత్తానికి ఉద్యోగుల పని విధానంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టేలా చేసింది కరోనా మహమ్మారి.