Site icon NTV Telugu

Netanyahu-Iran: ఇరాన్‌కు నెతన్యాహు తీవ్ర వార్నింగ్.. మునుపెన్నడూ చూడని శక్తిని చూస్తారని హెచ్చరిక

Netanyahu

Netanyahu

ఇరాన్‌ను నిన్నామొన్నటి దాకా ట్రంప్ పదే పదే వార్నింగ్‌లు ఇచ్చారు. కొద్దిరోజుల తర్వాత సౌదీ, ఖతార్ మధ్యవర్తిత్వంతో అమెరికా మెత్తబడింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వంతు వచ్చింది. తాజాగా ఇరాన్‌కు నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి వరకు తెలియని శక్తిని చూస్తారంటూ సూచించారు.

ఇది కూడా చదవండి: Greenland: గ్రీన్‌లాండ్‌లో ఉద్రిక్తతలు.. అమెరికా యుద్ధ విమానాలు మోహరింపు!

నెస్సెట్‌లో నెతన్యాహు ప్రసంగించారు.. ‘‘టెహ్రాన్ దాడి చేసే ధైర్యం చేస్తే.. దానికి సాటిలేని శక్తితో ప్రతిస్పందన ఉంటుంది.’’ అని ఇరాన్‌ను ఉద్దేశించి నెతన్యాహు హెచ్చరించారు. ఇరాన్‌లో గత కొద్దిరోజులుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. దీంతో భద్రతా దళాల కాల్పుల్లో 5 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అమెరికా సైనిక చర్యకు దిగుతోందని ట్రంప్ హెచ్చరించారు. దీంతో అమెరికా అణుశక్తితో నడిచే యుఎస్‌ఎస్ అబ్రహం లింకన్ నౌక మధ్యప్రాచ్యం వైపు బయలు వెళ్లింది. అయితే అమెరికా దాడి చేస్తే ప్రతీ దాడి తీవ్రంగా ఉంటుందని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలించిన నేపథ్యంలో నెతన్యాహు తాజాగా ఈ వ్యా్ఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ భవిష్యత్తును ఎవరూ అంచనా వేయలేరని.. కానీ దాని గతి గతాన్ని పోలి ఉండదన్నారు. ఇరాన్‌లో పాలన మార్పు గురించి నెతన్యాహు సూచనప్రాయంగా చెప్పినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Nitin Nabin: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నేడు నితిన్ నబిన్ ప్రమాణస్వీకారం

ఇక గాజా విషయంలో అమెరికా-ఇజ్రాయెల్ మధ్య విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. గాజా విషయంలో శాంతి మండలి ఏర్పాటు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనను నెతన్యాహు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం గాజాను ఇజ్రాయెలే పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలో టర్కీ, ఖతార్, మరికొన్ని ఇతర దేశాలతో శాంతి మండలి ఏర్పాటు చేస్తానని ట్రంప్ చెప్పడాన్ని మిత్ర దేశమైన అమెరికా తీరును ఇజ్రాయెల్ తప్పుపడుతోంది. హమాస్‌ను పూర్తిగా నిరాయుధీకరణ చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. అయితే విధానపరమైన తేడాలు ఉన్నప్పటికీ అమెరికాతో స్నేహం కొనసాగుతుందని నెతన్యాహు స్పష్టం చేశారు.

Exit mobile version