Benjamin Netanyahu: మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ సైరన్! ఇరాన్ అంతానికి నెతన్యాహు డెడ్లీ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Benjamin Netanyahu: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం వేడెక్కుతోంది. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చేసిన తాజా ప్రకటన అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇజ్రాయెల్ తలలపై వేలాడుతున్న ఈ ముప్పును ఒక్కసారిగా, శాశ్వతంగా తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని నెతన్యాహు శనివారం తన ప్రసంగంలో హెచ్చరించారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు మరో భీకర పోరుకు సంకేతాలా అనే చర్చకు దారితీశాయి.
ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని మళ్లీ పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తోందని, యురేనియం శుద్ధిని పునఃప్రారంభించడం ఇజ్రాయెల్ మనుగడకే పెను సవాలుగా మారిందని నెతన్యాహు ఆరోపించారు. ఇరాన్ పాలకులు ఇజ్రాయెల్‌ను పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తన సొంత దేశంలోనే వేలాది మంది పౌరులను పొట్టనబెట్టుకున్న ఇరాన్ ప్రభుత్వం, అణ్వాయుధాలను సమకూర్చుకుంటే ఇజ్రాయెల్‌పై వాటిని ప్రయోగించడానికి ఏమాత్రం వెనుకాడదని నెతన్యాహు స్పష్టం చేశారు. గతంలో చేపట్టిన సైనిక ఆపరేషన్ల తరహాలోనే, ఇరాన్ అణు లక్ష్యాలను అడ్డుకుని ఆ ముప్పును సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read
- Donald Trump: ట్రంప్‌కు కోర్టులో మరో షాక్.. వైట్‌హౌస్ సమీపంలోని గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్టుపై బ్రేక్!
- Lalit Modi Becomes British Citizen: లలిత్ మోడీకి బ్రిటిష్ పౌరసత్వం.. ఇక యూకేనే శాశ్వత నివాసం!
- Gaza Conflict: ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో.. హమాస్ కమాండర్ సమీర్ అబూ యూనిస్ హతం
- India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత్‌కు పాకిస్తాన్ మంత్రి!
ఇరాన్ ముప్పును ఎదుర్కోవాలంటే దేశంలో బలమైన నాయకత్వం అవసరమని పేర్కొంటూ, ఇజ్రాయెల్‌లోని ప్రధాన పక్షాలన్నీ కలిసి ‘జాతీయ ఐక్యతా ప్రభుత్వాన్ని’ ఏర్పాటు చేయాలని నెతన్యాహు పిలుపునిచ్చారు. గురువారం ప్రతిపక్ష నేత గాడి ఐజెన్కోట్తో సమావేశమైన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా చర్చలకు రావాలని ఆయన కోరారు. గత నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో (120 స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు 61 సీట్లు అవసరం), అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఐజెన్కోట్ను ఆహ్వానించారు.
అరబ్ పార్టీల మద్దతుతో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఐజెన్కోట్ ప్రయత్నాలను నెతన్యాహు తీవ్రంగా తప్పుబట్టారు. ఉగ్రవాద మద్దతుదారులపై ఆధారపడే బలహీనమైన ప్రభుత్వం ఇరాన్ వంటి పెద్ద ముప్పును ఏమాత్రం ఎదుర్కోలేదని ఆయన విమర్శించారు. అయితే, నెతన్యాహు ప్రతిపాదనను గాడి ఐజెన్కోట్, ఆయన ‘యషార్’ పార్టీ వర్గాలు తోసిపుచ్చాయి. ఎన్నికల్లో ఓటమి పాలైన నెతన్యాహు, అధికారాన్ని నిలుపుకోవడానికి భద్రతా అంశాలను అడ్డుపెట్టుకుని రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారని ఐజెన్కోట్ ఆరోపించారు. ఇలాంటి రాజకీయ జిమ్మిక్కులు తన వద్ద పనిచేయవని స్పష్టం చేసిన ఆయన, తాము త్వరలోనే అత్యవసర జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మరోవైపు, ఇరాన్‌పై ఏకపక్షంగా లేదా రాజకీయ ప్రయోజనాల కోసం సైనిక చర్యలకు దిగొద్దని ఐజెన్కోట్ ఇప్పటికే నెతన్యాహును హెచ్చరించడం గమనార్హం.
తాజావార్తలు
-
Benjamin Netanyahu: మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ సైరన్! ఇరాన్ అంతానికి నెతన్యాహు డెడ్లీ వార్నింగ్
-
Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లు.. 4.63 లక్షల మందికి మంజూరు.. కేటగిరీల వారీగా ఇలా..
-
Ind Vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ జయకేతనం.. సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా..
-
Rajasthan Train Blast: రైల్వే ట్రాక్ బాంబ్ బ్లాస్ట్.. పాక్ ఏజెంట్‌తో లవ్, పేలుడుకు యువతి కుట్ర..
-
Big Rain Alert: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన..
ట్రెండింగ్
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!
-
Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా ఇది నాతోనే ఉంది.. చిన్ననాటి బ్యాట్‌తో క్రికెట్ గాడ్..!