Netanyahu: ఇజ్రాయెల్‌కు భారత్ అండ.. నెతన్యాహూ కామెంట్స్‌తో అమెరికా షాక్..
- అమెరికా మాత్రమే కాదు.. భారత్ కూడా తమ బలమైన మిత్రదేశం.
- జేడీ వాన్స్ వ్యాఖ్యలకు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ కౌంటర్.
- "140 కోట్ల భారతీయుల నుంచి మాకు అపారమైన మద్దతు ఉంది" అని వ్యాఖ్య.
- ట్రంప్‌తో ఎలాంటి విభేదాలు లేవని నెతన్యాహు స్పష్టం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Netanyahu: ఇజ్రాయిల్‌కు అత్యంత సన్నిహిత, శక్తివంతమైన మిత్రదేశం అమెరికా కావచ్చు, కానీ అది ఒక్కటి మాత్రమే ఇజ్రాయిల్ మిత్రదేశం కాదని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఇజ్రాయిల్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఇజ్రాయిల్‌కు ఎన్నో మంచి మిత్రదేశాలు ఉన్నాయని, భారత్ కూడా ఇందులో ఒకటి అని నెతన్యాహూ పేర్కొన్నారు. ఇరాన్‌తో ట్రంప్ కుదుర్చుకున్న శాంతి ఒప్పందానికి ఇజ్రాయిల్ నేతలు మద్దతు ఇవ్వాలని జేడీవాన్స్ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజుల తర్వాత నెతన్యాహూ నుంచి ఈ ప్రకటన వచ్చింది.
జేడీ వాన్స్ ప్రకటనపై వ్యంగ్యంగా స్పందిస్తూ.. ‘‘ భారత్ అనే ఒక చిన్న దేశం లాంటి మరికొంత మంది మిత్రులు ఇజ్రాయిల్‌కు ఉన్నారు. అక్కడ 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. నిజం చెప్పాంటే అక్కడ మాకు అపారమైన మద్దతు ఉంది’’ అని నెతన్యాహూ అన్నారు. అమెరికా మాత్రమే ఇజ్రాయిల్‌కు ఏకైక మిత్రదేశమనే వ్యాఖ్యల్ని ఖండించారు. తనకు జేడీ వాన్స్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతూనే, అన్ని విషయాల్లో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. వైట్‌హౌజ్‌లో మాకు లభించిన అత్యంత గొప్ప స్నేహితుడు ట్రంప్ అని నెతన్యాహూ ప్రశంసలు కురిపించారు. ట్రంప్‌తో తమకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు.
Also Read
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
జేడీ వాన్స్ ఏమన్నారు?
ఇటీవల యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచంలో ఇజ్రాయిల్‌కు అమెరికానే ఏకైక శక్తివంతమైన మిత్రదేశమని అన్నారు. ఇరాన్‌తో అమెరికా కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని విమర్శించకుండా, ఇజ్రాయిల్ మద్దతు ఇవ్వాలని సూచించాడు. సైనిక చర్యలతోనే అన్ని భద్రతా సమస్యలకు పరిష్కారం లభించదని చెప్పారు.
దీనికి కౌంటర్‌గా నెతన్యాహూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అనేక దేశాలు తమకు మద్దతు తెలుపుతున్నాయని చెప్పారు. సైబర్ టెక్నాలజీ, ఏఐ, రక్షణ రంగాల్లో ఇజ్రాయిల్‌తో కలిసి పనిచేయడానికి అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని అన్నారు. లెబనాన్‌లో ఇజ్రాయిల్ సైనిక చర్యను సమర్థించారు. తమ దేశానికి ముప్పు కలిగించే ఏ శక్తుల నుంచైనా రక్షించుకునే హక్కు ఇజ్రాయిల్‌కు ఉందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు