ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తొలిసారి కోర్టు బోనెక్కారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న తొలి ఇజ్రాయెల్ ప్రధానిగా నిలిచారు. అవినీతి విచారణ కేసులో భాగంగా న్యాయస్థానం మెట్లెక్కారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజం చెప్పడానికి ఎనిమిదేళ్లు వేచి చూస్తున్నట్లు తెలిపారు. మోసం, నమ్మకద్రోహం, అవినీతి ఆరోపణలు.. మూడు వేర్వేరు వ్యవహారాలకు సంబంధించి మంగళవారం న్యాయస్థానంలో విచారణ మొదలైంది. అయితే గతంలో వచ్చిన ఆరోపణలను నెతన్యాహు ఖండిస్తున్నప్పటికీ విచారణకు హాజరయ్యారు. అయితే ప్రస్తుతం గాజా యుద్ధం కొనసాగుతున్న సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా టెల్ అవీవ్ కోర్టులోని భూగర్భ ఛాంబర్‌లో విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కీలక దస్త్రాలు, రహస్య సమాచారం లీక్‌కు సంబంధించిన వివిధ కేసుల్లో ప్రధాని సలహాదారులపై కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Collectors Conference: రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్.. కీలక అంశాలపై ఫోకస్..
తాను అనుకూలమైన వార్తా కవరేజీని కోరినట్లు వచ్చిన ఆరోపణలను నెతన్యాహు ఖండించారు. ఇక గత నెలలో గాజా సంఘర్షణలో యుద్ధ నేరాలకు పాల్పడినందుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నెతన్యాహు, మాజీ డిఫెన్స్ చీఫ్ యోవ్ గల్లంట్‌తో పాటు హమాస్ నాయకుడికి అరెస్ట్ వారెంట్ జారీ చేయబడింది. దీంతో నెతన్యాహు దేశీయ న్యాయపరమైన ఇబ్బందులు మరింత పెరిగాయి.
ఇక ఇటీవల లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య ఒప్పందాలు జరిగాయి. దీంతో యుద్ధం తగ్గిపోయింది. గాజాపై మాత్రం విరుచుకుపడుతోంది. తాజాగా సిరియాలో తిరుగుబాటుదారుల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. పొరుగుదేశాలు మాత్రం ఈ దాడులను ఖండిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: AP Liquor Sales: ఏపీలో లిక్కర్ అమ్మకాల జోరు