గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ప్రకటించిన దగ్గర మిత్రులైన ఐరోపా దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అమెరికా నిర్ణయంపై భగ్గుమన్నాయి. దీంతో మిత్ర దేశాల మధ్య ప్రస్తుతం సఖ్యత చెడింది. గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్ ఆధ్వర్యంలో ఉంది. డెన్మార్క్ ఏమో నాటో సభ్యత్వంలో ఉంది. అమెరికా భద్రతా నేపథ్యంలో గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకోవడం అవసరం అని అమెరికా వాదిస్తుంటే.. అబ్బే కుదరదంటూ యూరోపియన్ దేశాలు అడ్డుపడుతున్నాయి.
ఇది కూడా చదవండి: IMD Alert: నేడు పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. వడగళ్లు.. మెరుపులు ఉంటాయని హెచ్చరిక
తాజాగా ఇదే అంశంపై నాటో చీఫ్ మార్క్ రుట్టే సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైన్యం మద్దతు లేకుండా యూరప్ తనను తాను రక్షించుకోగలదా? అని ప్రశ్నించారు. రక్షించుకోలేదని.. ఒకవేళ రక్షించుకోగలదని భావిస్తే మాత్రం ప్రస్తుతం ఉన్న సైనిక వ్యయాలను రెట్టింపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని మార్క్ రుట్టే తేల్చి చెప్పారు.
‘‘ఇక్కడ ఎవరైనా అనుకుంటే… యూరోపియన్ యూనియన్ లేదా యూరప్ మొత్తం అమెరికా లేకుండా తనను తాను రక్షించుకోగలదని కలలు కనండి. మీరు చేయలేరు. యూరప్-యునైటెడ్ స్టేట్స్ ఒకదానికొకటి అవసరం. మీరు నిజంగా ఒంటరిగా ముందుకు వెళ్లాలనుకుంటే.. మీరు ఎప్పుడైనా 5 శాతంతో అక్కడికి చేరుకోగలరని మర్చిపోండి. అది 10 శాతం అవుతుంది. మీరు మీ స్వంత అణు సామర్థ్యాన్ని పెంచుకోవాలి. దానికి బిలియన్ల-బిలియన్ల యూరోలు ఖర్చవుతాయి. అమెరికా లేకుంటే స్వేచ్ఛ కోల్పోతాం.. అమెరికా అణు గొడుగు కోల్పోతాం’’ అని బ్రస్సెల్స్లో ఈయూ చట్టసభ సభ్యులతో రుట్టే వ్యాఖ్యానించారు.
వెనిజులాను అమెరికా స్వాధీనం చేసుకున్నాక గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ప్రకటించారు. అమెరికా భద్రతా నేపథ్యంలో గ్రీన్లాండ్లో గోల్డెన్ డోమ్ నిర్మించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నిర్ణయాన్ని కెనడా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో కెనడా, ఐరోపా దేశాలపై సుంకాలు విధిస్తానని ట్రంప్ బెదిరించారు. ప్రస్తుతం మిత్ర దేశాలు మెత్తబడుతున్నట్లుగా తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది.
ఇది కూడా చదవండి: Devara 2 : దేవర 2 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పిన నిర్మాత సుధాకర్