Cuba: అంధకారంలో క్యూబా.. ఇబ్బందులు పడుతున్న కోటి మంది..
- ఒక్కసారిగా అంధకారంలోకి వెళ్లిన ద్వీప దేశం క్యూబా..
- దేశంలోని ప్రధాన విద్యుత్ ప్లాంట్లలో ఒకటి విఫలం కావడంతో కూలిన జాతీయ పవర్ గ్రీడ్..
- కరెంట్.. ఆహారం.. నీరు.. ఔషధాల సరఫరా లేకపోవడంతో కోటి మంది ప్రజలు ఇబ్బందులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cuba: క్యూబా దేశంలో ఒక్కసారిగా అంధకారం ఏర్పడింది. దేశంలోని ప్రధాన విద్యుత్ ప్లాంట్లలో ఒకటి ఫెయిల్ కావడంతో జాతీయ పవర్ గ్రిడ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆ దేశంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం తలెత్తిందని అక్కడి విద్యుత్ శాఖ మంత్రి ప్రకటించారు. కరెంట్ లేకపోవడంతో దేశంలోని స్కూల్స్ అన్నింటినీ బంద్ చేసినట్లు వెల్లడించారు. అత్యవసరం కానీ పరిశ్రమలను మూసి వేసి కార్మికులను తమ ఇళ్లకు పంపించేశారు. ఇక, పవర్ ప్లాంట్ విఫలం కావడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Read Also: IND vs NZ: ఓటమి ఉచ్చులోనే భారత్.. ఈరోజు నిలబడితేనే..! ఆశలన్నీ ఆ ఇద్దరిపైనే
Also Read
ఇక, విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టే వరకు సంబంధిత అధికారులు రెస్ట్ తీసుకోవద్దని క్యూబా అధ్యక్షుడు మిజిల్ డియాజ్ కేనల్ ఆదేశాలు జారీ చేశారు. ఒక్కసారిగా ఆహారం, నీళ్లు, ఇంధనం, ఔషధాల సరఫరా దెబ్బతినడంతో దాదాపు కోటి మంది క్యూబా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రమైన ఉక్కపోతతో ద్వీప దేశ వాసులు, పర్యటకులు అల్లాడి పోతున్నారు. పునరుద్ధరణ చర్యలు చేపట్టినప్పటికీ విద్యుత్ సరఫరా ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!