Site icon NTV Telugu

Bilawal Bhutto: భారత్లో ముస్లింలను రాక్షసులుగా చూపిస్తున్నారు..

Bhtto

Bhtto

Bilawal Bhutto: ఆపరేషన్ సిందూర్‌పై భారత్ ఏర్పాటు చేసిన అఖిలపక్షం తరహాలోనే పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అధినేత బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలో ఒక పార్లమెంట్ సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం అమెరికా పర్యటనలో భాగంగా.. ఐక్యరాజ్య సమితి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని భారతదేశంలోని ముస్లింలను రాక్షసులుగా చూపించడానికి ఒక రాజకీయ సాధనంగా ఉపయోగిస్తున్నారని బిలావల్ భుట్టో ఆరోపించారు.

Read Also: V. Hanumantha Rao: రాహుల్ గాంధీ ఆపరేషన్‌ సిందూర్‌ని వ్యతిరేకించలేదు..

అయితే, అంతర్జాతీయ వేదికలపై తమ దేశానికి ఎదురవుతున్న పరాజయాలను పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత బిలావల్ భుట్టో ఒప్పుకున్నారు. ముఖ్యంగా కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాశ్మీర్‌ అంశానికి సంబంధించిన సమస్యను ఇప్పటికి మనం ఎదుర్కుంటున్నామని తెలిపారు. దీంతో పాటు ఇతర వేదికలపైనా పాకిస్తాన్ కు ఎన్నో అవమానాలు తగిలాయని బిలావల్ భుట్టో పేర్కొన్నారు.

Read Also: V. Hanumantha Rao: రాహుల్ గాంధీ ఆపరేషన్‌ సిందూర్‌ని వ్యతిరేకించలేదు..

ఇక, రెండు అణ్వస్త్ర దేశాలైన భారత్, పాకిస్తాన్‌ల మధ్య వివాదాల పరిష్కారానికి ఒక వ్యవస్థను తీసుకురావడం అంత ఈజీ కాదని పీపీపీ అధినేత బిలావల్ భుట్టో చెప్పుకొచ్చారు. కానీ, టెర్రరిజంపై పోరులో మాత్రం.. మా రెండు దేశాలకు చెందిన నిఘా సంస్థలు ఐఎస్‌ఐ, రా కలిసి కూర్చొని, ఈ ఉగ్రవాద శక్తులపై పోరాటం కోసం కలిసి పని చేస్తే, ఉగ్ర కార్యకలాపాలు తగ్గిపోతాయని అనుకుంటున్నాను.. లేదంటే, ఇరు దేశాల మధ్య నిరంతర ఘర్షణతో.. విద్రోహ శక్తులను మరింత బలోపేతం చేస్తుందని బిలావల్ భూట్టో ఆందోళన వ్యక్తం చేశారు.

Exit mobile version