Bangladesh Protests: ప్రముఖ క్రికెటర్ షకీబ్ అల్ హసన్‌పై మర్డర్ కేసు
- ప్రముఖ క్రికెటర్ షకీబ్ అల్ హసన్‌పై మర్డర్ కేసు
- బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్‌లో కోటా ఉద్యమం సందర్భంగా అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకొంత మంది క్షతగాత్రులయ్యారు. ఇక షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చేశారు. అనంతరం నోబెల్ గ్రహీత యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇదిలా ఉంటే షేక్ హసీనా ప్రభుత్వం రద్దవడంతో ప్రముఖ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ ఎంపీ పదవిని కోల్పోయాడు. ఇటీవలే బంగ్లా జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ఆల్‌రౌండర్‌కు తాజాగా గట్టి షాక్ తగిలింది. అతడిపై హత్య కేసు నమోదైనట్లు ఢాకా మీడియా కథనాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: Insha Ghaii Kalra: ప్రముఖ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ భర్త హఠాన్మరణం.. ఇన్షా భావోద్వేగ పోస్టు
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లలో రూబెల్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడి తండ్రి రఫీకుల్ ఇస్లామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడి మరణానికి మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వమే కారణమని ఆరోపించాడు. ఆయన ఫిర్యాదు ఆధారంగా షేక్ హసీనా సహా 154 మందిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఇందులో షకీబ్ 28వ నిందితుడిగా ఉన్నాడు. బంగ్లాదేశీ ప్రముఖ నటుడు ఫెర్దూస్ అహ్మద్‌ను కూడా ఇందులో 55వ నిందితుడిగా పేర్కొన్నారు. ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వీరిద్దరూ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ తరఫున ఎంపీలుగా ఎన్నికయ్యారు. అల్లర్ల నేపథ్యంలో హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఆమె ప్రభుత్వం రద్దయ్యింది. దీంతో వీరు పదవిని కోల్పోయారు.
ఇది కూడా చదవండి: Kolkata Doctor Case: నా కొడుకును ఎవరో ఇరికించారు.. కోల్‌కతా రేప్ ఘటన నిందితుడు తల్లి
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!