UK: లండన్ రైలులో కత్తి దాడి.. అనేక మందికి గాయాలు
- లండన్ రైలులో కత్తి దాడుల కలకలం..
- ఇద్దరు అనుమానితుల అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UK: లండన్‌లో కత్తిదాడులు కలకలం రేపాయి. లండన్‌కు వెళ్తున్న రైలులో ఇద్దరు అనుమానితులు అనేక మంది ప్రయాణికులపై కత్తితో దాడికి పాల్పడ్డారు. యూకే పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేశారు. శనివారం ఈ సంఘటన జరిగింది. గాయపడిన చాలా మందిని ఆస్పత్రికి తరలించారు. కేంబ్రిడ్జ్‌షైర్‌లోని తూర్పు గ్రామీణ పట్టణం హంటింగ్‌డన్‌లో దాడి గురించి సమాచారం రావడంతో రైలు ఆగిపోయింది. ఆ తర్వాత పోలీసులు రైలును చుట్టుముట్టారు. ఈ రైలు ఈశాన్య పట్టణమైన డాన్‌కాస్టర్ నుంచి లండన్ లోని కింగ్స్ క్రాస్ స్టేషన్ వరకు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. తరుచుగా ఈ రైలు ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
గాయపడిన, ఆస్పత్రికి తరలించిన వారి సంఖ్యపై స్పష్టత లేదు. బ్రిటిష్ మీడియా చెబుతున్న దాని ప్రకారం, 10 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనను ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్రంగా ఖండించారు. బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు ఇంటీరియర్ మినిస్టర్ షబానా మహమూర్ ధ్రువీకరించారు. అధికార డేటా ప్రకారం, ఇంగ్లాండ్, వేల్స్ ప్రాంతాల్లో వరసగా కత్తి దాడులకు సంబంధించిన నేరాలు పెరుగుతున్నాయి. బ్రిటన్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన చట్టాలు కలిగి ఉన్నప్పటికీ, ఈ కత్తి దాడులు పెరుగడంపై ప్రధాని స్టార్మర్ ‘‘జాతీయ సంక్షోభం’’గా ముద్ర వేశారు.
తాజావార్తలు
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో కయాదు మిస్సింగ్.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని షాకింగ్ కామెంట్స్!
-
Apple iPhone 18 Pro Sale: iPhone 18 Pro కొనుగోలు కోసం రాత్రి నుంచే భారీ క్యూ.. Apple స్టోర్ వద్ద కస్టమర్ల సందడి
-
Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
-
Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
-
Udaya Bhanu : నా పర్సనల్ లైఫ్ రచ్చకెక్కి ఛానళ్ల దాకా ఎందుకు వెళ్లిందంటే.. అసలు నిజాన్ని బయటపెట్టిన ఉదయభాను!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!