California Plane Crash: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో గురువారం రెండు చిన్న విమానాలు గాలిలోనే ఢీకొన్న ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. స్థానిక విమానాశ్రయంలో రెండు విమానాలు దిగేందుకు ప్రయత్నించిన తర్వాత వాట్సన్‌విల్లే నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Boycott Bollywood: నీ పని నువ్వు చేసుకో అంటూ అర్జున్ కపూర్‌కి మంత్రి కౌంటర్
“వాట్సన్‌విల్లే మునిసిపల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావడానికి ప్రయత్నించిన 2 విమానాలు ఢీకొన్న తర్వాత పలు ఏజెన్సీలు స్పందించాయి. మాకు అనేక మరణాల నివేదికలు ఉన్నాయి,” అని నగర అధికారులు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Multiple agencies responded to Watsonville Municipal Airport after 2 planes attempting to land collided. We have reports of multiple fatalities.
Report came in at 2:56pm.
Investigation is underway, updates to follow. pic.twitter.com/pltHIAyw5p
— City of Watsonville (@WatsonvilleCity) August 18, 2022