అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలుగు రోజుల విదేశీ పర్యటన కోసం మంగళవారం పశ్చిమాసియాకు వచ్చారు. మంగళవారం నుంచి 4 రోజుల పాటు సౌదీ, యూఏఈ, ఖతార్‌లో పర్యటించనున్నారు. ఇదిలా ఉంటే ఖతార్ పర్యటనలో డొనాల్డ్ ట్రంప్‌తో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సమావేశం కానున్నరు. దోహాలో వీరిద్దరి భేటీ ఉండనుంది. దోహాలోని లుసైల్ ప్యాలెస్‌లో ట్రంప్ కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర విందుకు అంబానీ హాజరవుతారు. అయితే ఈ భేటీలో ఎలాంటి చర్చలు ఉండవు. పెట్టుబడి లేదా వ్యాపార చర్చలకు సంబంధించిన ప్రణాళికలు లేనట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Rakul Preet : ఉక్కపోత పెంచేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్..
రిలయన్స్‌కు అమెరికా, ఖతార్‌లో కూడా వ్యాపారులన్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు దేశాల అధికారులతో వ్యాపార సంబంధాలు పెంపొందించుకోవాలని చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. అంతేకాకుండా ముఖేష్ అంబానీకి గూగుల్, మెటా, యూఎస్ టెక్ దిగ్గజాలతో అనేక వ్యాపార భాగస్వామ్యాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Anugula Rakesh Reddy : అందగత్తెల కోసం రోడ్డు పక్కన పేద ప్రజల షాపులను కూలుస్తారా…?
