Site icon NTV Telugu

Donald Trump: ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీ ఓ నియంత..

Donald Trrump

Donald Trrump

Donald Trump: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఓ నియంత.. అందుకే ఆ దేశంలో ఎన్నికలు జరపడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డాడు. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే కీవ్ వాదనను తప్పుబట్టారు. కాస్త భూమితో పోయేదాన్ని యుద్ధం వరకూ తెచ్చారని విమర్శించాడు. ఇప్పుడు ఎక్కువ ల్యాండ్ సహా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నాడు. యుద్ధానికి ఉక్రెయినే ప్రధాన కారణం, అది మొదలు కావడానికి ముందే ఒప్పందం చేసుకుంటే సరిపోయేదన్నారు. మూడేళ్లుగా ఆ పనిని ఎందుకు చేయలేదని క్వశ్చన్ చేశాడు. ఒక్కసారి ఆలోచించండి.. జెలెన్‌స్కీ అమెరికాతో మాట్లాడి 35,000 కోట్ల డాలర్లను యుద్ధంపై ఖర్చు పెట్టించాడు.. అది మాస్కోపై ఎప్పటికీ గెలవలేదు.. నేను లేకుండా ఆ యుద్ధాన్ని ఎవరు కొలిక్కి తీసుకురాలేరని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

Read Also: Delhi CM Oath Ceremony: నేడే ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ప్రధాని మోడీ

ఇక, సౌదీ అరేబియా వేదికగా అమెరికా-రష్యా మధ్య జరుగుతున్న చర్చల్లో ఉక్రెయిన్‌ను భాగస్వామిగా చేయకపోవడంపై వచ్చిన విమర్శలను డొనాల్డ్ ట్రంప్ కొట్టి పారేశారు. శాంతి చర్చల్లో తాము పాల్గొనబోమని జెలెన్‌స్కీ చేసిన కామెంట్స్ పై తీవ్రంగా మండిపడ్డాడు. ఉక్రెయిన్‌ను వారికి ఇప్పించేలా నేను ప్లాన్ చేస్తుంటే.. అతడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటిని ప్రశ్నించారు. బైడెన్‌ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో ఆయనకే అర్థం కాలేదని ట్రంప్ విమర్శించారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య బుద్ధిలేని యుద్ధం జరుగుతుంది.. దీనిని ఆపాలని రష్యా కోరుకుంటోందని వెల్లడించారు. ఇక, జెలెన్‌స్కీకి కేవలం 4 శాతమే ప్రజల మద్దతు ఉందన్నారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యలను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. రష్యా చేస్తున్న దుష్ప్రచారంలో అమెరికా అధినేత జీవిస్తున్నారని జెలెన్‌స్కీ అన్నారు.

Exit mobile version